Team India New Captain: భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్రలో ఒక శకం ముగిసింది. గత దశాబ్ద కాలంగా జట్టును విజయవంతంగా నడిపించిన స్టార్ ఆల్ రౌండర్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) అన్ని ఫార్మాట్ల (టెస్టులు, వన్డేలు, T20Iలు) కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ఈరోజు (అక్టోబర్ 6, 2026, మంగళవారం ) సంచలన ప్రకటన చేసింది. అయితే కెప్టెన్‌గా తప్పుకున్నప్పటికీ, ఒక ప్లేయర్ గా దేశం తరఫున ఆడటం కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేసింది.
హర్మన్‌ప్రీత్ అద్భుత ప్రస్థానం:
* 2016లో T20 జట్టు కెప్టెన్సీని చేపట్టిన హర్మన్‌ప్రీత్, ఆ తర్వాత 2022లో అన్ని ఫార్మాట్లకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆమె నాయకత్వంలో భారత జట్టు ఎన్నో చిరస్మరణీయ విజయాలను నమోదు చేసింది.
* ముఖ్యంగా గత ఏడాది సొంతగడ్డపై జరిగిన చారిత్రక మహిళల వన్డే వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికాను ఓడించి భారత్‌ను విశ్వవిజేతగా నిలపడంలో హర్మన్ ప్రీత్ కౌర్ కీలక పాత్ర పోషించింది.
* 2023, 2026 ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్‌కు వరుసగా రెండు స్వర్ణ పతకాలు అందించడంతో పాటు గత నెలలో ఆసియా కప్ ట్రోఫీని కూడా ముద్దాడారు.
* జట్టు ఇప్పుడు మంచి స్థితిలో ఉంది, నా బాధ్యతను విజయవంతంగా నిర్వర్తించానని భావిస్తున్నాను అని హర్మన్‌ప్రీత్ ఎక్స్ (ట్వీట్టర్) వేదికగా భావోద్వేగంతో కూడిన ప్రకటనలో పేర్కొంది.
కెప్టెన్ రేసులో స్మృతి మంధాన:
హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు భారత జట్టు కొత్త సారథి ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుత వైస్ కెప్టెన్, స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) తదుపరి కెప్టెన్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతుంది.
* గతంలో హర్మన్‌ప్రీత్ గైర్హాజరీలో స్టాండ్-ఇన్ కెప్టెన్‌గా వ్యవహరించిన మంధాన అద్భుతమైన ట్రాక్ రికార్డును కలిగి ఉంది. ఆమె నాయకత్వ సామర్థ్యాన్ని మాజీ దిగ్గజాలు మిథాలీ రాజ్, డయానా ఎడుల్జీతో పాటు పలువురు కోచ్‌లు గట్టిగా సమర్థిస్తున్నారు. WPL (మహిళల ప్రీమియర్ లీగ్) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టును టైటిల్ విజేతగా నిలపడంలో ఆమె వ్యూహాత్మక చతురత ఏంటో నిరూపితమైంది. మంధానతో పాటు దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ పేర్లు కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నప్పటికీ, మరీ ఎవరికీ జట్టు పగ్గాలు అప్పగించాలనే దానిపై బీసీసీఐ త్వరలోనే కొత్త కెప్టెన్‌పై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
