Health Tips: ఏసీలోనే ఉంటున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు కంపల్సరీ..!

Health Tips: ఏసీలోనే ఉంటున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు కంపల్సరీ..!

ఈరోజుల్లో ఏ ఆఫీసులో చూసినా ఎయిర్ కండీషర్లే.దాంతో ఉద్యోగులంతా గంటల తరబడి ఏసీలోనే పని చేస్తుంటారు. అందువల్ల వాళ్ల చర్మం, జుట్టు, పెదాలు తరుచూ పొ డి బారుతుంటాయి. ఇలాంటి సమస్యలను తగ్గించడానికి కొన్ని చిట్కాలు ఉంటాయి.

  •  ఏసీ వల్ల వచ్చే చల్లటి గాలిలో తేమ ఎక్కువ గా ఉండదు. కాబట్టి చర్మానికి కావాల్సిన తేమ అందాలంటే వీలైనంత వరకు ఎక్కువ నీళ్లను తాగడం చాలా ముఖ్యం. దాంతోపాటు రెండు గంటలకొకసారైనాఐదు నిమిషాల పాటు కారిడార్​లో  అటూఇటూ నడవడం అలవాటు చేసుకోవా లి.
  •  క్లెన్సర్స్, ఫేస్​ వాష్​ వాడుతున్నట్లైతే, వాటిలో నురుగు రాకుండా ఉండే ప్రొడక్ట్ నే ఎంచుకోవాలి. 
  •  రెండుగంటలకోసా రిచల్లని నీళ్లతో ముఖాన్ని తుడుచుకోవాలి. 
  • చర్మం ఎక్కువగా పొడిబారుతుంటే స్వయంగా తేమను అందించే ఏర్పాటు చేసు కోవాలి. దానికోసం చిన్నపాటి హ్యుమిడిఫయర్లు ఏర్పాటు చేసుకోవచ్చు. వీటి ధర తక్కువగానే ఉంటుంది.
  • ఆఫీసు డెస్కు మీద గాజు పాత్ర ఉంచి అందులో నీళ్లు పోసి కొన్ని పూల రెక్కల్ని వేయాలి. అది డెకరేటివ్ చూడటానికి ఆకర్షణీయంగా ఉంటూనే... తేమని అందిస్తుంది.