ప్రపంచ రికార్డు సాధించిన 8990 లగ్జరీ కార్ క్లబ్ ఫౌండేషన్

ప్రపంచ రికార్డు సాధించిన 8990 లగ్జరీ కార్ క్లబ్ ఫౌండేషన్

లక్నోలోని రామడ హోటల్ వేదికగా '8990 లగ్జరీ కార్ క్లబ్ ఫౌండేషన్' సరికొత్త చరిత్ర సృష్టించింది. 8990 రిజిస్ట్రేషన్ నంబర్‌ను కలిగి ఉన్న ఏకంగా 250 లగ్జరీ కార్లను ఒకే చోట విజయవంతంగా చేర్చి అరుదైన ఘనత సాధించింది. ఆగస్టు 13, 2026న జరిగిన ఈ అద్భుతమైన వేడుకను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యుకె అధికారికంగా గుర్తించి ధృవీకరించింది.

ఒకే రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఇన్ని భారీ సంఖ్యలో ప్రీమియం కార్లు ఒకే వేదికపైకి రావడం ప్రపంచంలోనే ఇది మొదటిసారి కావడం విశేషం. ఈ అద్భుత దృశ్యం ఆటోమొబైల్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ రికార్డుకు సంబంధించిన అధికారిక సర్టిఫికేట్‌ను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చార్టర్డ్ ఆఫీసర్లు రాజేష్ శుక్లా, రాజీవ్ శ్రీవాస్తవ్‌లు.. ఫౌండేషన్ వ్యవస్థాపకులు మహిపాల్ సింగ్‌కు అందజేశారు.

ఈ చారిత్రాత్మక రికార్డుపై క్లబ్ వ్యవస్థాపకులు మహిపాల్ సింగ్ స్పందిస్తూ.. ఈ గుర్తింపు 8990 కుటుంబం మొత్తానికి చెందుతుందన్నారు. 8990 గుర్తింపు నంబర్ కలిగిన 250 లగ్జరీ కార్లను ఒక్కచోట చేర్చడం సభ్యుల ఐక్యతకు, అంకితభావానికి నిదర్శనంగా పేర్కొన్నారు. కేవలం కార్ల పట్ల ఉన్న అభిరుచితో ప్రారంభమైన ఈ ప్రయాణం నేడు ఒక బలమైన కమ్యూనిటీగా ఎదిగిందని ఆనందం వ్యక్తం చేశారు.

►ALSO READ | నువ్వో బాత్‎రూమ్ లీడర్.. నిండు సభలో ఉదయనిధి స్టాలిన్ పరువుతీసిన మంత్రి

న్యూఢిల్లీలోని ద్వారక కేంద్రంగా పనిచేస్తున్న ఈ 8990 లగ్జరీ క్లబ్ ఫౌండేషన్.. లగ్జరీ కార్ల యజమానులను ఒకే తాటిపైకి తెస్తోంది. కేవలం కార్ల ప్రదర్శనే కాకుండా.. ప్రత్యేక సమావేశాలు, కమ్యూనిటీ బేస్డ్ కార్యక్రమాల ద్వారా ఆటోమొబైల్ రంగానికి ఈ క్లబ్ కొత్త వన్నె తెస్తోంది. వ్యవస్థాపకులు మహిపాల్ సింగ్ నాయకత్వంలో ఈ క్లబ్ భవిష్యత్తులో దేశవ్యాప్తంగా మరిన్ని వినూత్న కార్యక్రమాలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రత్యేకత కోసం ప్రారంభించిన ప్రయాణానికి ఒక ప్రపంచ స్థాయి గుర్తింపు రావటం సంతోషంగా ఉందని ఆయన చెప్పారు.