చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్, మంత్రి సీటీఆర్ నిర్మల్ కుమార్ మధ్య మాటల తుటాలు పేలాయి. సీటీఆర్ నిర్మల్ కుమార్‌ను సంఘీ మంత్రి అని ఉదయనిధి విమర్శించాడు. దీంతో ఉదయనిధిని బాత్ రూమ్ లీడర్ అంటూ అంతే ధీటుగా మంత్రి సీటీఆర్ నిర్మల్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. చివరకు మంత్రిపై చేసిన సంఘీ వ్యాఖ్యలకు ఉదయనిధి స్టాలిన్ క్షమాపణ చెప్పారు.
సీఎం విజయ్, త్రిష బంధంపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై డీఎంకే యువనేత, అపొజిషన్ లీడర్ ఉదయనిధి స్టాలిన్‌పై ఇటీవల కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో భాగంగా ఉదయనిధిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆయన ఇంటి వెళ్లగా తన భర్త బాత్ రూమ్‌లో ఉన్నాడని ఉదయనిధి భార్య పోలీసులకు చెప్పింది.
►ALSO READ | ఫ్రీ కార్లు మాకొద్దు.. CM విజయ్ ప్రతిపాదనను తిరస్కరించిన డీఎంకే
దాదాపు మూడు గంటల పాటు ఇలాగే చెబుతూ పోలీసులను వెయిట్ చేయించారు. చివరకు పోలీసులు ఎట్టకేలకు ఉదయనిధిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తాజాగా అసెంబ్లీలో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఉదయనిధి స్టాలిన్ ను బాత్ రూమ్ లీడర్ అంటూ మంత్రి సీటీఆర్ నిర్మల్ కుమార్ సెటైర్ వేశారు.
