ENG vs IND: కెనడా వేదికగా జరుగుతున్న ఓవర్-60 వరల్డ్ కప్‌లో భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ మధ్యలో ఊహించని వివాదం చెలరేగింది. టెరామోటో పార్క్ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్ ముగిశాక కూడా సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. అంపైర్ ఔట్ ఇచ్చిన కూడా ఇంగ్లాండ్ బ్యాటర్ స్టేడియం వీడకుండా అక్కడే మొండికేసి నిలబడటంతో సీన్ కంప్లీట్‌గా హీటెక్కింది. దీంతో ఏకంగా 15 నిమిషాల పాటు ఆట నిలిచిపోయి ప్లేయర్లు, అంపైర్లు తీవ్రంగా మండిపడ్డారు. చివరకు అంపైర్లు తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి రావడం, ఆ తర్వాత జరిగిన డ్రామా క్రికెట్ లవర్స్‌ను మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. మరి అసలు ఏం జరిగింది, ఆ డ్రామా ముగింపు ఏంటో అనేది ఇప్పుడు చూద్దాం..
ఔట్ ఇచ్చినా పెవిలియన్‌కి పోనన్న బ్యాటర్.. మైదానంలో హైడ్రామా:
ఆగస్టు 17వ తేదీన జరిగిన ఈ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 20వ ఓవర్ వేసేందుకు భారత లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మయాంక్ ఖండ్వాలా బాల్ పట్టుకుని వచ్చాడు. మొదటి బాల్‌కే ఇంగ్లాండ్ బ్యాటర్ తైమూర్ ఆలమ్ ప్యాడ్‌ను బంతి గట్టిగా తాకడంతో టీమిండియా ప్లేయర్లు బిగ్గరగా అప్పీల్ చేశారు. ఆన్-ఫీల్డ్ అంపైర్ ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఔట్ అని వేలు పైకెత్తాడు. కానీ ఇక్కడ ఊహించని ట్విస్ట్ ఏంటంటే.. తైమూర్ ఆలమ్ తనకు బ్యాట్ తగిలిందని చెప్తూ క్రీజు వదిలి వెళ్లడానికి కంప్లీట్‌గా నిరాకరించాడు. అంపైర్ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ అతను అక్కడే ఉండిపోవడంతో ఇండియన్ ప్లేయర్లు అంపైర్లను చుట్టుముట్టారు. రచ్చ పెరగడంతో ఆటగాళ్లు కొద్దిసేపు ఫీల్డ్ నుంచి బయటకెళ్లిపోయారు. ఏకంగా 15 నిమిషాల సస్పెన్స్, హైడ్రామా తర్వాత అంపైర్లు తమ నిర్ణయాన్ని మార్చుకుని నాటౌట్ అని ప్రకటించడంతో తైమూర్ 30 రన్స్ వద్ద మళ్లీ బ్యాటింగ్ కొనసాగించాడు.
వికెట్ తీసి గట్టిగా సాగనంపిన భారత బౌలర్.. కానీ ఆఖరి నవ్వు ఇంగ్లాండ్‌దే:
ఈ గందరగోళం ముగిసిన రెండు ఓవర్లకే భారత స్పిన్నర్ మయాంక్ ఖండ్వాలా రివెంజ్ తీర్చుకున్నాడు. తైమూర్ ఆలమ్‌ను క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్ కి పట్టించాడు. కేవలం 10 పరుగులు మాత్రమే అదనంగా చేసి 40 రన్స్ దగ్గర ఔట్ అయిన తైమూర్‌కి మయాంక్ ఫుల్ ఫైరీ సెండ్‌ఆఫ్ ఇచ్చాడు. కానీ ఈ రచ్చలో చివరకు ఇంగ్లాండ్ జట్టే నవ్వింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ టీమ్ 45 ఓవర్లలో 167/7 పరుగులు చేయగా, లక్ష్యచేధనలో టీమిండియాను కేవలం 159 పరుగులకే ఆలౌట్ చేసి 8 రన్స్ తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. తైమూర్ ఆలమ్ ఆ 15 నిమిషాల డ్రామా తర్వాత చేసిన ఆ 10 పరుగులే ఇంగ్లాండ్ గెలుపులో అత్యంత కీలకంగ మారడం గమనార్హం.
►ALSO READ | టీమిండియా జాగ్రత్త: శ్రీలంకని తక్కువ అంచనా వేస్తే అంతే.. భారత్‌తో రెండో టెస్టుకు బిగ్ ప్లాన్ ఇదే!
విచారణకు ఆదేశించిన ఇంగ్లాండ్ బోర్డు.. నెట్టింట మీమ్స్:
అంపైర్ నిర్ణయాన్ని ధిక్కరించి క్రీజులోనే ఉండిపోవడం క్రికెట్ రూల్స్ కి విరుద్ధం కావడంతో ఈ ఇన్సిడెంట్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాజీ దిగ్గజాలు, ఫ్యాన్స్ ఈ చర్యను తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఈ వివాదంపై స్పందించిన ఇంగ్లాండ్ క్రికెట్ సీనియర్స్ బోర్డు ఆఫీషియల్ స్టేట్‌మెంట్ రిలీజ్ చేసింది. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ స్టార్ట్ చేశాం, లైవ్ స్ట్రీమింగ్‌లో కేవలం కొన్ని క్షణాల వీడియో మాత్రమే కనిపిస్తోంది, విచారణ పూర్తయ్యే వరకు ఫ్యాన్స్ ఎలాంటి ముగింపునకు రాకూడదని విజ్ఞప్తి చేసింది. త్వరలోనే దీనికి సంబంధించి పూల్ రిపోర్టుని వెల్లడిస్తామని బోర్డు తేల్చి చెప్పింది.
