సంగారెడ్డిలో రాత్రి 9.30కు దీక్ష ప్రారంభించిన జగ్గారెడ్డి దంపతులు..

సంగారెడ్డిలో రాత్రి 9.30కు దీక్ష ప్రారంభించిన జగ్గారెడ్డి దంపతులు..

సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా సంగారెడ్డి లో దీక్షకు దిగారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఆయన సతీమణి నిర్మల.  సంగారెడ్డి పాత బస్టాండ్ సమీపంలో ని అంబేద్కర్ విగ్రహం దగ్గర 2026 అక్టోబర్ రాత్రి 9.30 గంటలకు దీక్షను ప్రారంభించారు.

ఈ సందర్భంగా జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాహుల్ పోరాటానికి  సంగారెడ్డి నుంచి మద్ధతు ఇస్తున్నామని తెలిపారు. రాహుల్ ఎన్ని రోజులు పోరాటం చేస్తే అన్ని రోజులు ఇక్కడ దీక్ష చేస్తామన్నారు. రాహుల్ రోడ్డుపై వచ్చి ధర్నాలు చేస్తే.. మేము ఇంట్లో కూర్చుంటామా.. అని అన్నారు.

రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ పోరాటం ఉంటుందన్నారు. ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీని ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. రాహుల్ గాంధీ ముత్తాత జవహర్ లాల్ నెహ్రు దేశ ప్రజల కోసం ఓటు హక్కుని తెచ్చారని తెలిపారు. ఓటుతో సీఎం, పీఎం ని ఎన్నుకునే అవకాశం కల్పించారన్నారు. 

అన్ని ప్రభుత్వ  శాఖలను బీజేపీ వాడుకుంటుందని ఆరోపించారు. దేశ ప్రజల భద్రత కోసం రాహుల్ గాంధీ వీధి పోరాటం చేస్తుంటే మనం మద్దతివ్వాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ, ఏపి నుంచే కాకుండా.. దేశం మొత్తం రాహుల్ పొరాటానికి బలం ఇచ్చేలా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.