మైహోం జ్యువైల్లో అగ్నిప్రమాదం జరిగింది. మియాపూర్ మదీనాగుడలోని నివాస సముదాయంలో 14వ అంతస్తులో మంటలు చెలరేగాయి. దీంతో జనాలు ఫ్లాట్లు వదిలి కిందికి పరుగులు తీశారు. మంటలు అంటుకోవడంతో భారీ ఎత్తున పొగలు వ్యాపించడంతో భయానక పరిస్థితులు కనిపించాయి.
2026 అక్టోబర్ 7 సాయంత్రం ఘటన జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు అగ్నిమాపక సిబ్బంది. ఏసిలోని షాక్ సర్క్యూట్ కారణంగా 14వ అంతస్తులో ఉన్న ప్లాట్ లో మంటలు చేలరేగినట్లు తెలిపారు.
ఈ ప్రమాదంలో స్వల్ప ఆస్తి నష్టం వాటిల్లిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
