తెలుగు రాష్ట్రాల్లో పది చోట్ల ఈడీ సోదాలు.. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లో తనిఖీలు

తెలుగు రాష్ట్రాల్లో పది చోట్ల ఈడీ సోదాలు.. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లో తనిఖీలు

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు చేపట్టారు.  వై ఎస్ వివేకానంద హత్య కేసులో నిందితుడైన  ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి నివాసంతో పాటు అప్రూవర్‌ దస్తగిరి ఇళ్లలోనూ తనిఖీలు చేశారు... హైదరాబాద్​(6 చోట్ల)  .. ఆంధ్రప్రదేశ్​ (4 చోట్ల) రాష్ట్రాల్లో  మొత్తం పది చోట్ల ఈడీ అధికారులు ఒకేసారి తనిఖీలు చేపట్టారు. 

 వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి డబ్బు చెల్లింపులు, ఆర్థిక లావాదేవీల పత్రాలు, డిజిటల్ ఆధారాలపై పరిశీలన చేస్తున్నారు. వివేకా హత్య కేసుతో ముడిపడిన మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.  ఈ తనిఖీల్లో భాగంగా కడప, హైదరాబాద్‌లోని పలువురు ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన నివాసాలు, ఇతర ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.