ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడంటే..

ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడంటే..

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. మున్సిపాలిటీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను ఒకేసారి ప్రకటించారు. ఏపీలో మున్సిపాలిటీ ఎన్నికలకు సెప్టెంబర్ 7న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు షెడ్యూల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. సెప్టెంబర్ 20న పోలింగ్, సెప్టెంబర్ 23న ఫలితాలను వెల్లడించడం జరుగుతుంది.

ఇక.. గ్రామ పంచాయతీ ఎన్నికల విషయానికొస్తే.. పంచాయతీ ఎన్నికలకు అక్టోబర్ 19న నోటిఫికేషన్, అక్టోబర్ 28న పోలింగ్, అదే రోజున ఫలితాలను వెల్లడించనున్నట్లు షెడ్యూల్ స్పష్టం చేసింది. ఇక.. ZPTC/MPTC ఎన్నికలకు సెప్టెంబర్ 28న నోటిఫికేషన్, అక్టోబర్ 11న పోలింగ్, అక్టోబర్ 14న కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుందని ఈ షెడ్యూల్లో తెలిపారు.