ఇదేం పని రా బాబు.. సారా టెండూల్కర్ ఫొటోను ఇలా మార్చేశారేంటి?

ఇదేం పని రా బాబు.. సారా టెండూల్కర్ ఫొటోను ఇలా మార్చేశారేంటి?

Sara Tendulkar: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ముద్దుల తనయ సారా టెండూల్కర్ పేరుతో నెట్టింట ఒక షాకింగ్ వీడియో ట్రెండ్ అవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని వాడుకుని కొందరు ఆకతాయిలు సారా ప్రతిష్టను దిగజార్చేలా ఒక అశ్లీల డీప్‌ఫేక్ వీడియోను క్రియేట్ చేశారు. జిమ్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఆమె వేసుకున్న దుస్తులను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో లక్షలాది మంది దాన్ని నిజమని నమ్మి షేర్ చేశారు. తీరా అసలు నిజం బయటపడటంతో ఏఐ క్రియేటర్లపై నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.  

అసభ్యంగా సారా ఫోటో మార్ఫింగ్: 

సోషల్ మీడియాలో తెగ తిరుగుతున్న ఆ క్లిప్‌లో సారా టెండూల్కర్ బ్లాక్ బ్రా, గ్లామరస్ షార్ట్ వేసుకుని జిమ్ నుంచి వస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే ఇది వంద శాతం నకిలీ వీడియో అని పరిశీలనలో తేలింది. నిజానికి ఆ సమయంలో సారా శరీరం మొత్తం కవర్ అయ్యేలా సాధారణ బ్లాక్ టీషర్ట్, ట్రాక్ ప్యాంట్ వేసుకుంది. కేవలం ఏఐ టెక్నాలజీతో ఆమె బట్టలను అలా మార్పిడి చేసి ఆకతాయిలు వైరల్ చేసినట్లు తేలింది. ఈ ఫ్రాడ్ ని కనిపెట్టిన సచిన్ ఫ్యాన్స్ ఒరిజినల్ వీడియోను షేర్ చేస్తూ ఫేక్ ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు.

ఆస్ట్రేలియా టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా సారా: 

సారా టెండూల్కర్ కేవలం స్టార్ కిడ్ మాత్రమే కాదు తన సొంత ఇమేజ్‌తో దూసుకెళ్తోంది. తండ్రి సచిన్ టెండూల్కర్‌కు చెందిన ఛారిటబుల్ ఫౌండేషన్ వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకోవడంతో పాటు ఆస్ట్రేలియా పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా సేవలు అందజేస్తోంది. సమాజంలో ఎంతో మంచి గుర్తింపు ఉన్న ఆమె ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేలా ఇలాంటి ఏఐ సైబర్ క్రైమ్స్ జరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

►ALSO READ | కోర్టు క్లీన్ చిట్: షేర్ ఆయా, షేర్ ఆయా అంటూ బ్రిజ్ భూషణ్‌కు గ్రాండ్ వెల్కమ్.. మదర్సా పిల్లల వీడియో వైరల్!

నాకు నచ్చకపోతే నిశ్చితార్థం కూడా క్యాన్సిల్ చేసుకుంటా: 

ఇటీవల వోగ్ ఇండియా మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సారా తన లైఫ్ పార్ట్‌నర్ గురించి పలు ఆసక్తికర విషయాలని షేర్ చేసుకుంది. మా అమ్మ నాన్నలు భార్యాభర్తల కంటే ముందు మంచి ఫ్రెండ్స్.. వాళ్ల మధ్య ఉండే బాండింగ్, ఈక్వాలిటీనే నాకు పెద్ద ఇన్సిపిరేషన్. నా భర్త నుంచి కూడా అదే స్నేహాన్ని కోరుకుంటున్నాను.. అంతేకాకుండా నేటి జెన్-జీ (Gen-Z) తరం మైండ్‌సెట్ గురించి మాట్లాడుతూ.. నచ్చని వ్యక్తిని పెళ్లి చేసుకోనని, ఒకవేళ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నా కూడా సరైన వ్యక్తి కాదనిపిస్తే ఆ బంధాన్ని తెంచుకోవడానికి వెనుకాడనని సారా తెలిపింది.