జైతాపూర్ ఎల్లమ్మ గుడిలో చోరీ

జైతాపూర్ ఎల్లమ్మ గుడిలో చోరీ

ఎడపల్లి, వెలుగు: నిజామాబాద్ ​జిల్లా ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

దొంగలు మంగళవారం ఆలయ గర్భగుడి తలుపులు తెరిచి ఎల్లమ్మ విగ్రహంపై ఉన్న బంగారు వస్తువులు, ఆలయంలోని వెండి వస్తువులను దొంగిలించారని ఆలయ నిర్వహకులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై ముత్యాల రమ ఆలయానికి వచ్చి చోరీ జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.