వాయు సేన కొత్త అధిపతిగా.. ఎయిర్ మార్షల్ ఆశుతోష్ దీక్షిత్

వాయు సేన కొత్త అధిపతిగా.. ఎయిర్ మార్షల్ ఆశుతోష్ దీక్షిత్

భారత వాయుసేన (IAF) 29వ నూతన అధిపతిగా ఎయిర్ మార్షల్ ఆశుతోష్ దీక్షిత్ నియమితులయ్యారు. ప్రస్తుతం వాయుసేన వైస్ చీఫ్‌గా సేవలందిస్తున్న ఆయన, అక్టోబర్ 31 నుంచి ఈ బాధ్యతలను స్వీకరించనున్నారు. ప్రస్తుత ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ (AP Singh) అదే రోజున పదవీ విరమణ చేయనున్నారు. 

ఆశుతోష్ 1986 డిసెంబర్ 6న వాయుసేన ఫైటర్ స్ట్రీమ్‌లో చేరారు. దాదాపు 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయనకు 3వేల500 గంటలకు పైగా విమానాలను నడిపిన అనుభవం ఉన్నది. కార్గిల్ యుద్ధ సమయంలో ఆపరేషన్ సఫేద్ సాగర్, ఆపరేషన్ రక్షక్, ఆపరేషన్ సిందూర్ లో ఆయన కీకల పాత్ర పోషించారు. 

 భారతదేశ రక్షణ రంగంలో స్వయంసమృద్ధి (ఆత్మనిర్భరత) సాధనలో భాగంగా స్వదేశీ యుద్ధ విమానం LCA తేజస్ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడంలో అయనది కీరోల్. దేశానికి ఆయన అందించిన సేవలకు గానూ పీవీఎస్ఎం, ఏవీఎస్ఎం, వీఎం, వీఎస్ఎం వంటి విశిష్ట సేవా పతకాలు లభించాయి.