ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈసారి చలి తక్కువే! డిసెంబర్ నాటికి పీక్ స్టేజ్కు ఎల్నినో ప్రభావం

ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈసారి చలి తక్కువే! డిసెంబర్ నాటికి పీక్ స్టేజ్కు ఎల్నినో ప్రభావం
  • ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈసారి చలి తక్కువే!
  • వింటర్​లో కనిష్ట ఉష్ణోగ్రతలు 1 నుంచి 3 డిగ్రీలు అధికం
  • డిసెంబర్ నాటికి పీక్ స్టేజ్​కు ఎల్​నినో ప్రభావం
  • ఈ నెల 10వ తేదీ తర్వాత నైరుతి తిరోగమనం
  • ప్రస్తుతం సాధారణం కన్నా 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు
  • రాబోయే నాలుగైదు నెలలు వేసవిలా ఎండలు 


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈసారి చలికాలంపైనా ఎల్ నినో ప్రభావం ఉండబోతున్నది.  అక్టోబర్ నుంచి మొదలయ్యే వింటర్ సీజన్ లో కనిష్ట ఉష్ణోగ్రతలు  సాధారణం కన్నా 1 నుంచి 3 డిగ్రీల వరకు ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో బలంగా ఉన్న ఎల్ నినో పరిస్థితులు క్రమంగా మరింత బలపడి డిసెంబర్ నాటికి తీవ్ర స్థాయికి చేరుకుంటాయంటున్నారు. వచ్చే ఏడాది మార్చి వరకు ఇదే దశ కొనసాగి, మార్చి నుంచి తగ్గుముఖం పట్టి జూన్–జులై నాటికి సాధారణ స్థితికి చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 33 నుంచి 36 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 35.8 నుంచి 36 డిగ్రీలు, దక్షిణ తెలంగాణలో 34 డిగ్రీలు, సెంట్రల్ జిల్లాల్లో 1 నుంచి 2 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. రాత్రి వేళల్లో నమోదయ్యే కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం సాధారణం కన్నా ఎక్కువగా 25 నుంచి 26 డిగ్రీల వరకు రికార్డవుతున్నాయి. హైదరాబాద్ సిటీలోనూ ఉష్ణోగ్రతలు 34 నుంచి 35 డిగ్రీల రేంజ్‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నమోదవుతుండగా, ఇవి సాధారణం కంటే 1 నుంచి 2 డిగ్రీలు ఎక్కువ. వచ్చే నాలుగైదు రోజుల పాటు రాష్ట్రంలో ఇదే విధంగా ఎండల తీవ్రత కొనసాగనుంది.

15 తర్వాత రాష్ట్రానికి ఈశాన్య రుతుపవనాలు... 

వానాకాలం సీజన్ వర్షపాతాన్ని పరిశీలిస్తే రాష్ట్రంలో సగటున మైనస్ 18 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. టెక్నికల్ గా ఇది సాధారణ వర్షపాతంగానే పరిగణిస్తున్నప్పటికీ, జిల్లాల వారీగా తీవ్ర అసమానతలు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో నైరుతి రుతుపవనాల తిరోగమనం మొదలైంది. ఇప్పటికే కొంకణ్, మధ్య మహారాష్ట్ర, విదర్భ, జార్ఖండ్, ఛత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గఢ్ ప్రాంతాల నుంచి రుతుపవనాలు నిష్క్రమించాయి. మన రాష్ట్రం నుంచి ఈనెల 10వ తేదీ తర్వాత, అంటే అక్టోబర్ 10 నుంచి 15 మధ్య నైరుతి రుతుపవనాలు విరామం తీసుకోనున్నాయి.  అదే సమయంలో ఈశాన్య రుతుపవనాలు మొదలవుతాయి కాబట్టి, పొడి వాతావరణం, తూర్పు గాలుల తేమ కలవడం వల్ల దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి  రఘు తెలిపారు. సాధారణంగా ఎల్ నినో ఉన్న సమయాల్లో ఈశాన్య రుతుపవనాల వల్ల రాయలసీమ, తమిళనాడుతో పాటు దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదు కావాలని, కానీ ప్రస్తుత అంచనాల ప్రకారం దక్షిణ తమిళనాడు, కేరళ, దక్షిణ కర్నాటకల్లోనే అధిక వర్షపాతం కనిపించే సూచనలున్నాయని వివరించారు.


డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో పీక్‌‌‌‌ స్టేజ్‌‌‌‌కు ఎల్‌‌‌‌నినో


రాష్ట్రంలో ఎల్‌‌‌‌నినో ప్రభావం ఎనిమిది నెలల పాటు ఉంటుంది. మార్చి  నుంచి తగ్గుముఖం పడుతూ జూన్–జులై నాటికి సాధారణ స్థితికి చేరుకుంటుంది. దీని ప్రభావం డిసెంబర్ నాటికి పీక్ స్టేజ్‌‌‌‌ కు చేరుకుంటుంది. ఈ సారి చలికాలంలో కూడా కనిష్ట ఉష్టోగ్రతలు సాధారణం కంటే.. 1 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే పరిస్థితి కనిపిస్తున్నది.ఈశాన్య రుతుపవనాలు మరో వారంపది రోజుల్లో రాష్ట్రంలోకి ఎంటరైతున్నప్పటికీ.. దక్షిణ తెలంగాణలో వర్షాలు పడే చాన్స్ తక్కువగానే కనిపిస్తున్నాయి. 
- రఘు, వాతావరణశాఖ, హైదరాబాద్​