భూములు కోల్పోయిన రైతులకు ప్లాట్లు కేటాయించాలి : టీపీసీసీ వర్కింగ్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ జగ్గారెడ్డి

భూములు కోల్పోయిన రైతులకు ప్లాట్లు కేటాయించాలి :  టీపీసీసీ వర్కింగ్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ జగ్గారెడ్డి
  •     టీపీసీసీ వర్కింగ్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ జగ్గారెడ్డి, కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ చైర్మన్  నిర్మలా జగ్గారెడ్డి విజ్ఞప్తి
  •     హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ లేఅవుట్‌‌‌‌‌‌‌‌లపై కలెక్టర్​ రివ్యూ

సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి నియోజకవర్గంలోని ఆరుట్ల, ఫసల్ వాది, కందిలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ల్యాండ్  పూలింగ్​లో భూములు కోల్పోయిన రైతులకు వెంటనే ప్లాట్లు కేటాయించాలని టీపీసీసీ వర్కింగ్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ జగ్గారెడ్డి, కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ చైర్మన్  నిర్మలా జగ్గారెడ్డి సూచించారు. హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ లే అవుట్లపై సోమవారం సంగారెడ్డి కలెక్టర్  ప్రతీక్​ జైన్​ రివ్యూ మీటింగ్‌‌‌‌‌‌‌‌  నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి, నిర్మల మాట్లాడుతూ ఆరుట్ల, ఇంద్రకరణ్‌‌‌‌‌‌‌‌, ఫసల్‌‌‌‌‌‌‌‌వాది, కంది ప్రాంతాల్లో గతంలో ల్యాండ్‌‌‌‌‌‌‌‌  పూలింగ్‌‌‌‌‌‌‌‌  ద్వారా భూములు తీసుకుని రైతులకు సర్టిఫికెట్లు ఇచ్చినా, ప్లాట్లు చూపించలేదన్నారు. 

ఇప్పటికే కొన్ని లేఅవుట్​ల ప్రక్రియ పూర్తి కాగా, మరికొన్ని పూర్తి చేయాల్సి ఉందని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. లే అవుట్లకు సంబంధించిన పనులను పూర్తి చేసి, భూములు కోల్పోయిన లబ్ధిదారులకు సాధ్యమైనంత త్వరగా ప్లాట్లు కేటాయించాలని జగ్గారెడ్డి కోరారు. వచ్చే నవంబర్‌‌‌‌‌‌‌‌ చివరి కల్లా హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ లేఅవుట్లలో భూములు కోల్పోయిన రైతులందరికీ ప్లాట్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ఆదేశించారు.