ఇబ్రహీంపట్నం, వెలుగు: రంగారెడ్డి జిల్లాలో ఫేషియల్ రికగ్నైషన్ ద్వారా హాజరు నమోదు చేయని 68 మంది టీచర్లకు డీఈవో వెంకటేశ్వర్లు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గత నెల ఎఫ్‌ఆర్‌ఎస్‌లో హాజరు ఎందుకు నమోదు చేయలేదో చెప్పాలని వారిని డీఈవో ఆదేశించారు. స్కూల్స్లో టీచర్లు సమయానికి రావడాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ఎఫ్ఆర్ఎస్ అమలు చేస్తున్నామని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు.
