ఆగమన్ ఘటనలో సిద్ధిఖీ అరెస్టు

ఆగమన్ ఘటనలో సిద్ధిఖీ అరెస్టు

హైదరాబాద్ సిటీ, వెలుగు:  ముషీరాబాద్‌‌   రాంనగర్‌‌లో జరిగిన గణేశ్​ఆగమన ఊరేగింపులో డీజే సౌండ్, పటాకులు కాల్చడంతో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన బద్రీనాథ్ (19)  కేసులో నిర్వాహకుడు సిద్ధీఖీని పోలీసులు అరెస్టు చేశారు. వేడుకల్లో ప్రజల ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసి కూడా సిద్ధిఖీ అహ్మద్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడని తేల్చారు.

సెప్టెంబర్ 5న రాత్రి ఈ ఘటన జరగ్గా, మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిద్దిఖీ ముందస్తు పర్మిషన్​ లేకుండా డీజే సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశాడని, విచ్చలవిడిగా పటాకులు కాల్చడంతో  తొక్కిసలాట జరిగిందని గుర్తించారు. అప్పుడు కిందపడిన బద్రీనాథ్ ఊపిరాడక చనిపోయాడని, దీనికి సిద్ధిఖీ కారణమంటూ అరెస్ట్​చేశారు.