పెరుగుతోన్న వెజి‘ట్రబుల్స్’.. ఎల్ నినో ఎఫెక్ట్‎తో భారీగా పెరిగిన కూరగాయల ధరలు

పెరుగుతోన్న వెజి‘ట్రబుల్స్’.. ఎల్ నినో ఎఫెక్ట్‎తో భారీగా పెరిగిన కూరగాయల ధరలు

న్యూఢిల్లీ: ఎల్ నినో కారణంగా దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు అమాంతం పెరిగాయి. సామాన్యుడి జేబుపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. ఉల్లిపాయల ధరలు 68.27 శాతం, బంగాళాదుంపల ధరలు 62.28 శాతం, టమోటా ధరలు 11.05 శాతం చొప్పున పెరగడంతో వంటింటి బడ్జెట్ పూర్తి అస్తవ్యస్తంగా మారింది. అల్పాదాయ వర్గాలు తమ ఆదాయంలో అత్యధిక భాగాన్ని ఆహారానికే ఖర్చు చేయాల్సి వస్తోంది. 

జులైలో సీపీఐ ఆధారిత ఆహార ద్రవ్యోల్బణం పెరగడంతో ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అకాల వర్షాలు, రుతుపవనాల అసమానత, సరఫరా గొలుసులో తలెత్తిన ఆటంకాల కారణంగా పంట దిగుబడి తగ్గి విపరీతమైన కొరత ఏర్పడింది. ఆర్బీఐ ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ఆహార ధరల పెరుగుదల వల్ల ఈ సూచీలు అస్థిరంగా మారుతున్నా యి.

 ప్రభుత్వం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు బఫర్ స్టాక్ నుంచి ఉల్లిపాయలను విడుదల చేయడం. ఎగుమతులపై సుంకాలు విధించడం వంటి చర్యలు ప్రారంభించింది. రాబోయే రోజుల్లో మార్కెట్కు కొత్త పంట వస్తేనే ధరలు తగ్గే అవకాశం ఉందని విశ్లేషకు లు చెబుతున్నారు. ఆహార ద్రవ్యోల్బణం అదుపులోకి రాకపోతే, జనం కొనుగోలు శక్తి మరింత తగ్గి, ఇతర వినియోగ రంగాలపై కూడా ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంది.