గడచిన వారం రోజులుగా బులియన్ మార్కెట్లలో కొంత సానుకూల ధోరణి కనిపిస్తోంది. చాలా కాలంగా రేట్ల తగ్గింపుల కోసం ఎదురుచూస్తున్న కొనుగోలుదారులకు ఊరట లభిస్తోంది. దసరా, దీపావళికి షాపింగ్ చేద్దాం అనుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ముందుగా తగ్గిన రేట్లను రేట్లను పరిశీలించాకే ముందుకు వెళ్లటం బెటర్.
అక్టోబర్ 6న బంగారం రేట్లు తగ్గాయి. అక్టోబర్ 5 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు దేశవ్యాప్తంగా రూ.16 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 902గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 660గా కొనసాగుతోంది.
మంగళవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. అక్టోబర్ 6, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కూడా స్వచ్ఛమైన వెండి కేజీ రూ.2లక్షల 45వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.245 దగ్గర ఉంది.
