దేశద్రోహం కేసులో.. జర్మనీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అరెస్ట్

దేశద్రోహం కేసులో.. జర్మనీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అరెస్ట్

జర్మనీ మాజీ విదేశీ గూఢచార అధిపతి ఆగస్ట్ హ్యానింగ్‌ను దేశద్రోహం ఆరోపణలపై అరెస్టు చేశారు. ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత జర్మనీలో జరిగిన అతిపెద్ద ఇంటెలిజెన్స్ స్కాంలలో ఒకటిగా చెప్పుకునే ఈ కేసులో దేశ నిఘా రహస్యాలను విక్రయించారనే ఆరోపణలతో మంగళవారం ఆగస్ట్ హ్యానింగ్ ను అరెస్ట్ చేశారు.  దేశ నిఘా విభాగం సీక్రెట్ సమాచారాన్ని ఓ విదేశీ గూఢచర్య సంస్థ కు అమ్మేశారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ గూఢచర్య సంస్థను ఇప్పటివరకు గుర్తింపు గానీ, అది ఇతర వ్యక్తుల చేతికి చేరిందా లేదా అనేది అస్పష్టంగానే ఉన్నది. 

అయితే ఓ దేశ నిఘా విభాగపు మాజీ అధిపతిని అరెస్టు సరికాదని ఇది మిత్ర దేశాలతో ఆ దేశ నిఘా సంబంధాలను దెబ్బతీస్తుందని జర్మని లామేకర్స్ ఆందోళన వ్యక్తం చేశారు. 

2005లో BND విదేశీ గూఢచార సంస్థ అధిపతిగా ఆయన ఐదేళ్లు పనిచేశారు.  దేశ నిఘా విభాగపు సీక్రెట్ సమాచారాన్ని  షేర్ చేసేందుకు ఓ మాజీ BND ఆఫీస్ మేనేజర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారని ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు.