శంషాబాద్ ఎయిర్ పోర్టులో.. రూ.2.25కోట్ల విదేశీ బంగారం పట్టివేత

శంషాబాద్ ఎయిర్ పోర్టులో.. రూ.2.25కోట్ల విదేశీ బంగారం పట్టివేత

హైదరాబాద్‌: శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా విదేశీ బంగారాన్ని పట్టుబడింది. విదేశాలనుంచి  హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తున్న దాదాపు కేజిన్నర బంగారాన్ని ఓ ప్రయాణికుడి నుంచి డీఆర్ ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం (అక్టోబర్6) తమిళనాడు తిరుచ్చి నుంచి విమానంలో హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. అతడి నుంచి 1481 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.  పట్టుబడిన బంగారం విలువ సుమారు రూ. 2.25 కోట్లు ఉంటుందని వెల్లడించారు. గోల్డ్ అక్రమ రవాణాపై పక్కా సమాచారంతో గోల్డ్ తరలిస్తున్న  ప్రయాణికుడిని పట్టుకున్నారు. 

లోదుస్తుల్లో ప్రత్యేక పౌచ్ లో దాచి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.  బంగారాన్ని ఆరు ముక్కలు గా కార్మన్ పేపర్ తో చుట్టు నీలిరంగు టేప్ వేసి లోదుస్తుల్లో  దాచినట్టు డీఆర్ ఐ అధికారులు తెలిపారు. నిందితుడి అరెస్ట్ చేసి కస్టమ్స్ చట్టం 1962 కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.