‘బేబీ’ ఫేమ్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘Epic - First Semester’ సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదలై మిక్సెడ్ లాక్ అందుకుంది. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 9న Netflixలో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించంది సంస్థ. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఎపిక్ ఆడియన్స్ కు అందుబాటులోకి రాబోతోందని తెలిపింది.
Idhi Telugu NRIs relate ayye 90s kids’ Epic katha 😎❤️ https://t.co/S52Pd9Zf38
— Netflix India South (@Netflix_INSouth) October 6, 2026
కథ:
వనపర్తికి చెందిన ఆదిత్య (ఆనంద్ దేవరకొండ) ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్తాడు. అక్కడ కడలి (వైష్ణవి చైతన్య) పరిచయం కావడంతో ఇద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది. ఆ తర్వాత వారి బంధం లివ్-ఇన్ రిలేషన్‌షిప్ వరకు వెళ్తుంది. అయితే విదేశీ జీవితం, కుటుంబ అంచనాలు, వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రేమలో ఎదురయ్యే సమస్యలు వారి జీవితాలను మలుపుతిప్పుతాయి. ఈ పరిస్థితుల్లో ఆదిత్య, కదలి తమ బంధాన్ని ఎలా కాపాడుకున్నారు? చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారన్నదే ‘Epic - First Semester’ కథ.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య తమ పాత్రలకు తగ్గట్టుగా నటించగా.. ముఖ్యంగా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ప్రేమకథతో పాటు నేటి యువత ఎదుర్కొనే రిలేషన్‌షిప్ సమస్యలను చూపించే ప్రయత్నం చేసింది ‘ఎపిక్’. అయితే కథనం, కొన్ని సన్నివేశాల విషయంలో ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది.
థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ అందుకున్న ఈ మూవీ ఇప్పుడు Netflixలో ఎలాంటి రెస్పాన్స్ సొంతం చేసుకోనుందో ఆసక్తిగా చూడాలి.
