రాయదుర్గంలో TGIIC భూముల వేలం.. ఎకరం రూ.264 కోట్లు !

రాయదుర్గంలో TGIIC భూముల వేలం.. ఎకరం రూ.264 కోట్లు !

హైదరాబాద్: రాయదుర్గంలోని TGIIC భూములు వేలంలో రికార్డు ధర పలికాయి. TGIIC భూమి ఎకరా రూ.264 కోట్లు పలికింది. రాయదుర్గంలోని సర్వే నం.83/1లోని 5.25 ఎకరాలకు ఆన్‌లైన్‌లో వేలం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పాన్ మక్తలోని సర్వే నంబర్ 83/1లో ప్లాట్ల వేలాన్ని నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించిన క్రమంలో శుక్రవారం వేలం జరిగింది.

చారిత్రక నిర్మాణాలు, రాళ్లు ఉన్న ప్రాంతంలో జోక్యం చేసుకోబోమని ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో వేలంలో జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) భూములకు మస్తు డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే.. రాయదుర్గంలోని పాన్ మక్త భూములకు టీజీఐఐసీ వేలం నిర్వహించింది.

  • రాయదుర్గంలో TGIIC భూములకు రికార్డ్ ధర.. ఎకరం రూ.264 కోట్లు
  • TGIIC నిర్వహించిన ఈ-వేలంలో భారీ ధర పలికిన రాయదుర్గం భూములు
  • రాయదుర్గంలోని సర్వే నెంబర్ 83/1లో రికార్డు ధర పలికిన భూమి
  • 5.25 ఎకరాలకు ఆన్ లైన్ లో వేలం నిర్వహించిన TGIIC 
  • కనీస ధర రూ. 175 కోట్ల రూపాయలుగా నిర్ధారించిన టీజీఐఐసీ
  • 3 నెలల క్రితం ఇదే ప్రాంతంలో రూ. 237 కోట్లు పలికిన ఎకరం భూమి