6వ తరగతి జీకే బుక్ లో ఇటలీ ప్రధాని మెలోని చాప్టర్... సోషల్ మీడియాలో వీడియో వైరల్...

6వ తరగతి జీకే బుక్ లో ఇటలీ ప్రధాని మెలోని చాప్టర్... సోషల్ మీడియాలో వీడియో వైరల్...

6వ తరగతి జీకే బుక్ లో ఇటలీ ప్రధాని మెలోనికి సంబంధించిన చాప్టర్ ఉందంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది. జీకే బుక్ లో మెలోని చాప్టర్ చూపిస్తూ ఓ మహిళ ఇన్స్టాగ్రామ్ లో వీడియో షేర్ చేసింది. ఈమె ఎవరో చూడండి... దీన్నే మేల్ ఎఫ్ర్ట్స్ అంటారని సరదాగా కామెంట్ చేస్తూ వీడియో షేర్ చేసింది సదరు మహిళ.

జీకే బుక్ లో మెలోని రాజకీయ ప్రస్థానాన్ని, విజయాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 22, 2022 నుండి ఇటలీ ప్రధానమంత్రిగా గుర్తిస్తూ, ఆ పదవిని చేపట్టిన మొదటి మహిళ కూడా ఆమేనని పేర్కొంటుంది. మెలోని 1977 జనవరి 15న రోమ్‌లో జన్మించి, 15 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆమె తర్వాత రోమ్ ప్రావిన్స్‌లో కౌన్సిలర్‌గా పనిచేశారు, యువతకు సంబంధిత కార్యక్రమాలపై కృషి చేశారంటూ మెలోని గురించి చెప్పుకొచ్చారు.

మెలోని 2008లో ఇటలీ యువజన మంత్రి అయ్యారు, తద్వారా ఆ సమయంలో మంత్రి పదవిని చేపట్టిన అతి పిన్న వయస్కురాలిగా నిలిచారు. 2012లో, ఆమె బ్రదర్స్ ఆఫ్ ఇటలీ (ఫ్రాటెల్లి డి'ఇటాలియా)కి కో ఫౌండర్ గా ఉన్నారు, 2014లో బ్రదర్స్ ఆఫ్ ఇటలీకి అధినేత్రి అయ్యారు.

►ALSO READ | CM రేవంత్ అమెరికా టూర్ అనుమతి నిరాకరణపై కేంద్రం క్లారిటీ

2024లో ఆమె అట్లాంటిక్ కౌన్సిల్ నుండి గ్లోబల్ సిటిజన్ అవార్డును అందుకున్నారని, ఇటలీ ఆర్థిక వ్యవస్థ, కుటుంబ విధానాలు, వలస విధానానికి సంబంధించిన సంస్కరణలు, మార్పులకు ఆమె నాయకత్వమే కారణమని కూడా ఈ బుక్ లో ఉంది.అయితే... ఆ బుక్ ప్రైవేట్ పబ్లిషర్స్ కి సంబంధించినదా లేక స్టేట్ సిలబస్ కి సంబంధించిందా అన్నది క్లారిటీ లేదు.