కేంద్రం మెడలు వంచిన రాహుల్:  పెల్లెట్ గన్ కాల్పులపై ఎట్టకేలకు FIR ఫైల్

కేంద్రం మెడలు వంచిన రాహుల్:  పెల్లెట్ గన్ కాల్పులపై ఎట్టకేలకు FIR ఫైల్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ అపొజిషన్ లీడర్ రాహుల్ గాంధీ పోరాటం ఫలించింది. రాహల్ పోరాటానికి కేంద్రం మెడలు వంచింది. రాహుల్ ధర్నాకి తలొగ్గిన ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్ దగ్గర సీజేపీ చలో పార్లమెంట్ నిరసనల్లో పెల్లెట్ గన్ కాల్పులపై ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.

అసలేం జరిగిందంటే..? 

నీట్ యూజీ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జులై 20న విద్యార్థులు చలో పార్లమెంట్ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ చలో పార్లమెంట్ తీవ్ర హింసాత్మకంగా మారింది. విద్యార్థులపై పోలీసులు బలప్రయోగం చేశారు. నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్, పెల్లెట్ గన్స్ ప్రయోగించారు.

సాహిల్ లోచబ్ అనే నిరసనకారుడు పెల్లెట్ గన్ కాల్పుల వల్ల తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో సాహిల్ లోచబ్ శుక్రవారం (ఆగస్ట్ 21) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఆశ్రయించాడు. రాహుల్ గాంధీ స్వయంగా సాహిల్, అతని కుటుంబ సభ్యులను తీసుకుని స్టేషన్‎కు వెళ్లి బాధితుడి ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరాడు.

కానీ పోలీసులు కేసు రిజిస్టర్ చేసేందుకు ఒప్పుకోలేదు. దీంతో రాహుల్ గాంధీ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళనకు దిగాడు. బాధితుడి శరీరంలో 200కు పైగా పెల్లెట్ షెల్స్ ఉన్నాయని.. ఒక కంటి చూపు కోల్పోయినప్పటికీ కేసు నమోదు చేయరా అని పోలీసులు, కేంద్ర ప్రభుత్వం ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాహుల్ ధర్నాకు సంఘీభావంగా కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున స్టేషన్ దగ్గరకు చేరుకున్నారు. బాధితుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేసే వరకు వెనక్కి తగ్గేది లేదని రాహుల్ తెగేసి చెప్పాడు. కాంగ్రెస్ శ్రేణుల భారీ నిరసనలు, రాహుల్ గాంధీ పట్టుబట్టడంతో ఎట్టకేలకు దిగొచ్చిన ఢిల్లీ పోలీసులు బాధితుడు సాహిల్ లోచబ్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు.