WTC ఫైనల్ రేసులో బిగ్ ట్విస్ట్ : 4 జట్లు ఔట్, డేంజర్లో మరో 3 టీమ్స్.. భారత్ సంగతేంటి?

WTC ఫైనల్ రేసులో బిగ్ ట్విస్ట్ : 4 జట్లు ఔట్, డేంజర్లో మరో 3 టీమ్స్.. భారత్ సంగతేంటి?

WTC Final Race: లండన్ ది ఓవల్ మైదానంలో జూన్ 9వ తేదీ నుంచి జరిగే డబ్ల్యూటీసీ (WTC) 2027 ఫైనల్ పోరుకు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. ఈసారి ఫైనల్ చేరాలంటే 65 శాతం పాయింట్లు సాధించడం తప్పనిసరి కావడంతో ఈ పోరు పీక్స్‌కి చేరింది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ టాప్–3లో పటిష్టంగా ఉంటే.. టీమిండియా ఐదో స్థానంలో కొనసాగుతుంది. మరోవైపు ఇంగ్లాండ్, పాకిస్తాన్, వెస్టిండీస్ ఆశలు గాల్లో కలవగా.. బంగ్లాదేశ్ ఊహించని విధంగా రేసులోకి దూసుకొచ్చింది. ఇండియా వరుసగా మరోసారి ఫైనల్ చేరాలంటే మిగిలిన 8 టెస్టులు అత్యంత కీలకంగా మారాయి. మరి టాప్–2లో నిలిచి ఆ ట్రోఫీని ముద్దాడే ఆ రెండు జట్లు ఏవో చూడాల్సిందే. 

వెస్టిండీస్ అవుట్.. పాకిస్తాన్, ఇంగ్లాండ్‌లకు డోర్లు క్లోజ్!

ఈ సైకిల్‌లో వెస్టిండీస్ కథ ముగిసింది. 12 మ్యాచ్‌ల్లో రెండే గెలిచి విండీస్ 9వ స్థానానికి పడిపోయింది. ఇటు పాకిస్తాన్, ఇంగ్లాండ్ పరిస్థితి కూడా అంతే.. పాక్ ఫైనల్ రేసులో నిలవాలంటే మిగిలిన 7 టెస్టులు వరుసగా గెలవాల్సిందే. 13 మ్యాచ్‌లాడిన ఇంగ్లీష్ టీమ్ మిగిలిన ఎనిమిదింటిలో 8 నెగ్గినా అగ్రస్థానాలకు రావడం దాదాపు ఇంపాజిబుల్.. ఇక శ్రీలంక కూడా మిగిలిన 7 టెస్టులు తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. 

డార్విన్ టెస్టులో మాస్ కంబ్యాక్.. రేసులోకి బంగ్లాదేశ్: 

ఎవరూ ఊహించని రీతిలో బంగ్లాదేశ్ జట్టు పాయింట్ల పట్టికను షేక్ చేసేసింది. డార్విన్ టెస్టులో ఆస్ట్రేలియాను చిత్తు చేసి చారిత్రక విజయం సాధించడంతో 66.67 శాతం పాయింట్లతో నాలుగో స్థానానికి దూసుకెళ్లింది. చేతిలో ఇంకా ఏడు టెస్టులు ఉండటం వాళ్లకు ప్లస్ పాయింట్. దీంతో ఆసీస్, సఫారీలతో పాటు బంగ్లా కూడా ఫైనల్ బెర్త్ కోసం గట్టిగా పోటీ పడుతుంది. 

►ALSO READ | భారత్ vs ఆఫ్ఘన్ టీ20 సిరీస్‌ వాయిదా.. ఏసీబీ కొత్త తేదీలతో గందరగోళంలో బీసీసీఐ

భారత్ WTC ఫైనల్ చేరే లెక్కలు ఇవే: 

ప్రస్తుతం భారత జట్టు 10 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో 53.33 శాతం PCTతో ఐదో పొజిషన్లో కొనసాగుతుంది. మొత్తం 18 మ్యాచ్‌ల షెడ్యూల్‌లో భారత్ ముందు ఇంకా 8 టెస్టు మ్యాచులున్నాయి. ఈ మ్యాచ్‌ల్లో అత్యంత నిలకడగా రాణిస్తేనే టీమిండియాకు ఓవల్ లో జరిగే ఫైనల్ బెర్త్ దక్కుతుంది. మరి ఈ ఐదు జట్ల మధ్య జరగబోయే యుద్ధంలో ఏ టీమ్ ని విజయం వరిస్తుందో చూడాల్సిందే.