ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం ఎయిర్ ఫోర్స్ అధికారుల సర్వే

ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం ఎయిర్ ఫోర్స్ అధికారుల సర్వే

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం విషయంలో  కీలక ముందడుగు పడింది. ఎయిర్ పోర్ట్, ఎయిర్ పోర్ట్ స్టేషన్ నిర్మాణం కోసం 2026 ఆగస్టు 21న అధికారులు సర్వే నిర్వహించారు. బెంగళూరు నుంచి ఆదిలాబాద్ వచ్చిన ఎయిర్ ఫోర్స్ అధికారులు.. హెలికాప్టర్ లో ఏరియల్ సర్వే నిర్వహించారు. 

ఆదిలాబాద్ లోని  కచ్ కంటి, అనుకుంట, ఖానాపూర్,  ప్రాంతాల్లో ఎయిర్ ఫోర్స్ అధికారులు ఏరియల్  సర్వే నిర్వహించారు.  ఎయిర్ పోర్టుకు అనువైన స్థలం గురించి  భూములను పరిశీలించారు.  ఎయిర్ పోర్టు నిర్మాణంలో భాగంగా తొలి అడుగు పడటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ సర్వే పూర్తయింది. భూసేకరణ కోసం అధికారికంగా సర్వే మొదలుపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 2 వేల 278 కోట్లు మంజూరు చేసింది. 2009 ఎకరాల భూమిని సేకరించనుండగా.. అందుకు సంబంధించి సర్వే చేపట్టారు అధికారులు. లేటెస్టుగా ఎయిర్ ఫోర్స్ అధికారులు సర్వే నిర్వహించడం కీలక పరిణామంగా చెబుతున్నారు.