లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఢిల్లీలో ధర్నాకు దిగారు. పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ లో పెల్లెట్ గన్ బాధితులతో ధర్నా చేపట్టారు. జులై 20 జెన్ జీ నిరసనల సందర్భంగా పెల్లెట్ గన్స్ వాడిన పోలీసులపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. 2026 ఆగస్టు 21న పెల్లెట్స్ కారణంగా గాయపడిన సహిల్ లోచాబ్ (19) తో కలిసి స్టేషన్ లో ప్రొటెస్టుకు దిగారు.
లోచాబ్ తో కలిసి సడెన్ గా స్టేషన్ కు వెళ్లిన రాహుల్ పోలీసులకు షాకిచ్చారు. విద్యార్థి గాయాలను చూపిస్తూ కేసు రిజిస్టర్ చేయాల్సిందిగా పోలీసులను కోరారు. దీనికి పోలీసులు నిరాకరించడంతో స్టేషన్ లో కూర్చుని ధర్నా చేపట్టారు.
కాక్రోచ్ నిరసనల సందర్భంగా పెల్లెట్ గన్స్ వాడకం వివాదాస్పదంగా మారింది. ఎంతో మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఇప్పటికీ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పోలీసులు, ప్రభుత్వం మాత్రం పెల్లెట్ గన్స్ వాడలేదంటున్నారు. ఇదిగో సాక్ష్యం.. పెల్లెట్ గన్ ఉపయోగించడంతో ఈ విద్యార్థికి ఎలా గాయాలయ్యాయో చూడండి.. కేసు రిజిస్టర్ చేస్తరా చేయరా.. అంటూ పోలీసులన ఉనిలదీశారు.
విద్యార్థుల చలో పార్లమెంట్ సందర్భంగా RAF సిబ్బంది పెల్లెట్ గన్స్ పేల్చారని కాంగ్రెస్ ఆరోపిస్తూ వస్తోంది. ఎంతో మంది విద్యార్థులు గాయపడిన ప్రూఫ్ చూపిస్తూ.. కేంద్రం ప్రభుత్వం ఎందుకు దీనిపై మాట్లాడటం లేదని ప్రశ్నిస్తోంది. అయితే కాంగ్రెస్ ఆరోపణలపై సీఆర్పీఎఫ్ మౌనంగానే ఉండిపోయింది.
ఇందులో భాగంగా రాహుల్ గాంధీ ముందుగా కన్నౌత్ ప్లేస్ పోలీస్ స్టేషన్ బాధితురాలితో చేరుకున్నారు. అయితే న్యూ ఢిల్లీ డీసీపీ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ లో ఉన్నట్లు తెలియడంతో.. అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పెల్లెట్ గన్ వినియోగంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు.. దర్యాప్తు ఎంత వరకు వచ్చిందని ప్రశ్నించారు. పెల్లెట్ గన్స్ వినియోగించిన సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు.
VIDEO | Delhi: Leader of Opposition in Lok Sabha Rahul Gandhi sits on dharna at Parliament Street police station, demands registration of FIR over pellet injuries during July 20 protest.#RahulGandhi
— Press Trust of India (@PTI_News) August 21, 2026
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/ETNtIehkMk
