ఇవాళ (అక్టోబర్ 6) వెస్టిండీస్‌‌‌‌తో ఇండియా తొలి టీ20.. గౌతీకి సవాల్‎గా శాంసన్‌‌‌‌, వైభవ్‌ ఎంపిక

ఇవాళ (అక్టోబర్ 6) వెస్టిండీస్‌‌‌‌తో ఇండియా తొలి టీ20.. గౌతీకి సవాల్‎గా శాంసన్‌‌‌‌, వైభవ్‌ ఎంపిక

లక్నో: ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచి జోరుమీదున్న ఇండియా టీ20 జట్టు.. వెస్టిండీస్‌‌‌‌తో ఐదు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌కు రెడీ అయ్యింది. ఇందులో భాగంగా మంగళవారం ఇరుజట్ల మధ్య తొలి పోరు జరగనుంది. అయితే ఓపెనర్‌‌‌‌గా సంజూ శాంసన్‌‌‌‌ను పంపాలా? లేక వండర్‌‌‌‌ కిడ్‌‌‌‌ వైభవ్‌‌‌‌ సూర్యవంశీకి చాన్స్‌‌‌‌ ఇవ్వాలా..? అన్నది హెడ్‌‌‌‌ కోచ్‌‌‌‌ గౌతమ్‌‌‌‌ గంభీర్‌‌‌‌కు పెద్ద సవాలుగా మారింది.

 వీవీఎస్‌‌‌‌ లక్ష్మణ్‌‌‌‌తో పోలిస్తే గౌతీ అనుసరించే వ్యూహాత్మక విధానంలో కచ్చితంగా మార్పు ఉంటుంది. కానీ ఇద్దరు కోచ్‌‌‌‌లు కూడా ఎనిమిదో నంబర్‌‌‌‌ వరకు బ్యాటింగ్‌‌‌‌ లోతు ఉండాలని నమ్ముతారు. కాబట్టి అభిషేక్‌‌‌‌ శర్మతో పాటు శాంసన్‌‌‌‌, వైభవ్‌‌‌‌లో ఒక్కరినే తుది జట్టులో ఆడించే చాన్స్‌‌‌‌ ఉంది. ఏషియాడ్‌‌‌‌ పిచ్‌‌‌‌ను బట్టి లక్ష్మణ్‌‌‌‌ ముగ్గుర్ని ఆడించాడు. 

వైభవ్‌‌‌‌ను ఓపెనర్‌‌‌‌గా పంపి శాంసన్‌‌‌‌ను మూడో ప్లేస్‌‌‌‌లో కొనసాగించాడు. ఫ్లాట్‌‌‌‌ పిచ్‌‌‌‌పై ఎక్కువ రన్స్‌‌‌‌ చేయాల్సిన అవసరాన్ని బట్టి ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే లక్నోలోని ఏకాన వికెట్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌కు అనుకూలం. కాబట్టి ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ నితీశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ రెడ్డి అందుబాటులో ఉండటంతో వైభవ్‌‌‌‌ను తప్పించి శాంసన్‌‌‌‌ను ఓపెనర్‌‌‌‌గా పంపే అవకాశం ఉంది. 

మిడిలార్డర్‌‌‌‌లో ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌, తిలక్‌‌‌‌ వర్మ, శివమ్‌‌‌‌ దూబే, నితీశ్‌‌‌‌, అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌లాంటి భారీ హిట్టర్లు ఉండటంతో శాంసన్‌‌‌‌ను మిడిలార్డర్‌‌‌‌లో ఆడించే అవకాశాల్లేవు. పేస్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌తో పాటు మయాంక్‌‌‌‌ యాదవ్‌‌‌‌, ప్రిన్స్‌‌‌‌ యాదవ్‌‌‌‌లో ఇద్దరికే చాన్స్‌‌‌‌ ఇవ్వనున్నారు. స్పిన్నర్లుగా అక్షర్‌‌‌‌, కుల్దీప్‌‌‌‌ను ఆడించనున్నారు. 

ఒకవేళ బ్యాటింగ్‌‌‌‌ను బలోపేతం చేయాలనుకుంటే నమన్‌‌‌‌ధీర్‌‌‌‌కు అవకాశం దక్కుతుంది. అప్పుడు ప్రిన్స్‌‌‌‌, మయాంక్‌‌‌‌లో ఒకరినే ఆడిస్తారు. ఈ సిరీస్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌గా శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌కు పెద్ద పరీక్ష కానుంది. ఎందుకంటే వెస్టిండీస్‌‌‌‌ 2012, 2016లో టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ గెలుచుకుని ఈ ఫార్మాట్‌‌‌‌లో అత్యంత శక్తివంతమైన జట్టుగా కొనసాగుతోంది. 

శ్రేయస్‌‌‌‌ నాయకత్వంలో జింబాబ్వే, అఫ్గానిస్తాన్‌‌‌‌పై టీ20 సిరీస్‌‌‌‌ విజయాలు నమోదు చేసినా.. పెద్ద జట్లపై ఇంకా ఖాతా తెరవలేదు. అయితే స్వదేశంలో విండీస్‌‌‌‌తో జరిగిన గత 10 మ్యాచ్‌‌‌‌ల్లో తొమ్మిదింటిలో ఇండియా గెలవడం కాన్ఫిడెన్స్‌‌‌‌ పెంచే అంశం. 

అందరూ హిట్టర్లే..

మరోవైపు టీ20ల్లో విండీస్‌‌‌‌ను ఏమాత్రం తక్కువగా అంచనా వేయలేం. రొమారియో షెఫర్డ్‌‌‌‌, రోవ్‌‌‌‌మన్‌‌‌‌ పావెల్‌‌‌‌, షిమ్రాన్‌‌‌‌ హెట్‌‌‌‌మయర్‌‌‌‌, అకీల్‌‌‌‌ హుస్సేన్‌‌‌‌లాంటి అత్యుత్తమ టీ20 ప్లేయర్లు జట్టులో ఉన్నారు. వీరందరికీ ఇండియాలో ఆడిన అనుభవం ఉంది. ఐపీఎల్‌‌‌‌లోనూ వీళ్లకు మంచి డిమాండ్‌‌‌‌ కూడా ఉంది. 

కెప్టెన్‌‌‌‌గా, బ్యాటర్‌‌‌‌గా షై హోప్‌‌‌‌ అద్భుతమైన ఫామ్‌‌‌‌లో ఉన్నాడు. ఇండియాతో జరిగిన చివరి వన్డేలో భారీ సెంచరీతో ఆకట్టుకున్నాడు. పావెల్‌‌‌‌, హెట్‌‌‌‌మయర్‌‌‌‌, రూథర్‌‌‌‌ఫోర్డ్‌‌‌‌ బ్యాట్లు ఝుళిపిస్తే పరుగుల వరద ఖాయం. ఆల్‌‌‌‌రౌండర్లుగా రోస్టన్‌‌‌‌ ఛేజ్‌‌‌‌, కీమో పాల్‌‌‌‌ కూడా కీలకం కానున్నారు. స్పిన్నర్లుగా హుస్సేన్‌‌‌‌, షామెర్‌‌‌‌ జోసెఫ్‌‌‌‌తో పాటు రిస్ట్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ గుడకేశ్ మోతీ అదనపు బలం కానున్నాడు.

తుది జట్లు (అంచనా)

ఇండియా: శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), అభిషేక్‌‌‌‌ శర్మ, సంజూ శాంసన్‌‌‌‌, ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌, తిలక్‌‌‌‌ వర్మ, శివమ్‌‌‌‌ దూబే, నితీశ్‌‌‌‌ కుమార్‌‌‌‌, అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌, కుల్దీప్‌‌‌‌ యాదవ్‌‌‌‌, మయాంక్‌‌‌‌ యాదవ్‌‌‌‌ / ప్రిన్స్‌‌‌‌ యాదవ్‌‌‌‌, అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌. 

వెస్టిండీస్‌‌‌‌: షై హోప్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), కామిల్‌‌‌‌ పూరన్‌‌‌‌, హెట్‌‌‌‌మయర్‌‌‌‌, రోవ్‌‌‌‌మన్‌‌‌‌ పావెల్‌‌‌‌, షెర్ఫానే రూథర్‌‌‌‌ఫోర్డ్‌‌‌‌, రొమారియో షెఫర్డ్‌‌‌‌, షామెర్‌‌‌‌ స్ప్రింజెర్‌‌‌‌, అకిల్‌‌‌‌ హుస్సేన్‌‌‌‌, గుడకేశ్‌‌‌‌ మోతీ, షామెర్‌‌‌‌ జోసెఫ్‌‌‌‌, మాథ్యూ ఫోర్డీ. 

పిచ్‌‌‌‌, వాతావరణం

బ్యాటింగ్‌‌‌‌ పిచ్‌‌‌‌. రన్స్‌‌‌‌ వేగంగా వస్తాయి. వాన వల్ల సోమవారం ప్రాక్టీస్‌‌‌‌ సెషన్స్‌‌‌‌ కూడా జరగలేదు. అయితే మ్యాచ్‌‌‌‌ టైమ్‌‌‌‌లో వర్షం ఉండదని వాతావరణ శాఖ నివేదిక.