నటసింహిం నందమూరి బాలయ్య మళ్లీ కెమెరా ముందుకు రెడీ అయ్యారు. కాలికి గాయం కారణంగా గత కొంతకాలంగా షూటింగ్ దూరంగా ఉన్న ఆయన ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. దర్శకుడు మలినేని గోపీచంద్, బాలకృష్ట కాంబినేషన్ లో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ 'దాదా' ను తెరకెక్కిస్తున్నారు. మైసూర్ లో ఈ మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ లో బాలకృష్ణతో పాటు కీలక నటీనటులు పాల్గొంటున్నారు.
జులైలో కాకినాడ పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో చిత్రీకరిస్తున్న ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ సమయంలో బాలయ్య కాలికి గాయమైన సంగతి తెలిసిందే. వైద్యుల సూచన మేరకు చికిత్స, విశ్రాంతి తీసుకున్న ఆయన.. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌తో రెట్టింపు ఎనర్జీతో సెట్స్‌లో అడుగుపెట్టడంతో అభిమానుల్లో ఫుల్ జోష్ మొదలైంది.
గతంలో బాలయ్య-గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన 'వీరసింహారెడ్డి'తో బ్లాక్‌బస్టర్ అందుకుంది. ఇప్పుడు మరోసారి ఈ కాంబో లో మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించే యాక్షన్ ట్రీట్‌ను సిద్ధం చేస్తోంది. ఈనేపథ్యంలో ఈ 'దాదా' పై అంచనాలు మరింత పెరిగాయి.
మరోవైపు మంచు మనోజ్. బాలయ్యతో కలిసి ఆయన పోషిస్తున్న కీలక పాత్ర సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. బాలకృష్ణ-మనోజ్ కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు థియేటర్లలో హైలైట్‌గా నిలవనున్నాయని చిత్రవర్గాలు చెబుతున్నాయి. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు.
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో పోర్ట్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు భారీ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండనున్నాయి. పెండింగ్ టాకీ, కీలక యాక్షన్ సన్నివేశాలను మైసూర్ షెడ్యూల్‌లో పూర్తి చేయనున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 'దాదా' డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
