నేషనల్ ఫెర్టిలైజర్స్ ఫ్రాంచైజీ ఇస్తామని మూడు కోట్ల రూపాయలు వసూలు చేసిన కిలాడీ సైబర్ నేరగాళ్లను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. అంతర్రాష్ట్ర నేరగాళ్లను అరెస్టు చేసిన సందర్భంగా.. వివరాలను 2026 ఆగస్టు 21న మీడియాకు వెల్లడించారు ఆదిలాబాద్ ఎస్పీ ఆఖిల్ మహాజన్ .
ఐదుగురు బీహర్ సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ చెప్పారు. వీళ్ల పై ఐదు వందల ఫిర్యాదులు ఉన్నట్లు తెలిపారు. సైబర్ నేరాలతో మూడున్నర కోట్ల రూపాయలు వసూలు చేశారు నిందితులు. నిందితుల నుంచి
పది సెల్ ఫోన్లను, డెబ్బై వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
అంతే కాకుండా నిందితుల బ్యాంకు ఖాతాల్లో, స్టాక్ మార్కెట్ లో ఉన్న ఎనిమిది లక్షల రూపాయలు జప్తు చేశామని తెలిపారు. సైబర్ నేరగాళ్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. అన్ లైన్ పెట్టుబడులు పెట్టి ప్రజలు మోసపోవద్దని హెచ్చరించారు.
