వేములవాడ భీమన్న క్షేత్రంలో భక్తుల రద్దీ

వేములవాడ భీమన్న క్షేత్రంలో భక్తుల రద్దీ

వేములవాడ​, వెలుగు: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి అనుబంధ శ్రీభీమేశ్వరస్వామి ఆలయం సోమవారం భక్తులతో రద్దీగా మారింది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తొలుత తలనీలాలు సమర్పించారు. అనంతరం కోడెమొక్కులు, ప్రత్యేక మొక్కుల క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి ప్రవేశించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో రమాదేవి నేతృత్వంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. 

ఇండియన్ బ్యాంక్ వేములవాడ శాఖ ఆధ్వర్యంలో సుమారు రూ.50 వేల విలువైన గోద్రెజ్ సేఫ్ లాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రాజన్న ఆలయానికి విరాళంగా అందజేశారు. దేవస్థానం ప్రోటోకాల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు ఈవో ఎల్.రమాదేవికి లాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందజేశారు.