ఎంసీ హరి, మనోజ్, శశిధర్, వేద జలంధర్, రావణ్ నిట్టూరు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అమీర్ లోగ్’. రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో మాధవి రెడ్డి సోమ నిర్మిస్తున్నారు. రానాకు సంబంధించిన స్పిరిట్ మీడియా ద్వారా సినిమా విడుదల కానుంది.
సోమవారం టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అతిథిగా హాజరైన నిర్మాత వంశీ నందిపాటి ఇలాంటి సినిమాలు ఆడితేనే తెలుగు పరిశ్రమ గర్వంగా తలెత్తుకుని తిరుగుతుందని అన్నారు. హైదరాబాద్ కల్చర్‌తో సాగే ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుందని నటీనటులు అన్నారు.
తాను రాసిన కథను తమదైన నటనతో ఆర్టిస్టులు నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లారని దర్శకుడు రమణా రెడ్డి చెప్పాడు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సందీప్, మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్ సాయి సహా టీమ్ అంతా పాల్గొన్నారు.
