నగరాలు, పట్టణాల్లో ఓటర్ల సహాయం కోసం హైదరాబాద్‌లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన 16 హెల్ప్ డెస్క్‌లతో పాటు అవసరమైన అన్ని చోట్లా అదనపు హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. పూర్తి చేసిన ప్రతి ఎన్యూమరేషన్ ఫారంలో సదరు ఓటరుతోపాటు బీఎల్‌వో సంతకం, అలాగే ఓటరు ఫొటో కచ్చితంగా ఉండేలా సరిచూసుకోవాలన్నారు.
ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించాలని, సమాంతరంగా డిజిటలైజేషన్ (ఆన్‌లైన్ నమోదు) ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) ప్రక్రియపై కలెక్టర్లకు సీఈవో కీలక మార్గదర్శకాలు జారీ చేశారు.
ఒకే కుటుంబానికి చెందిన ఓటర్ల పేర్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో కాకుండా, అందరి పేర్లు ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆన్‌లైన్ ద్వారా వచ్చే ఫారాలను కూడా బీఎల్‌వోలు క్షుణ్నంగా సరిచూసుకోవాలని, ఈ ఫారాల భర్తీపై బీఎల్‌వోలు, సూపర్‌వైజర్లకు మరో విడత శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు.
ALSO READ : కార్పొరేషన్ పదవులపై ఉత్కంఠ!
అదే విధంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసి, ‘సర్’ ప్రక్రియపై వారికి పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ ఎన్నికల అధికారి చారి, డిప్యూటీ కలెక్టర్ (ఎస్‌జీడీసీ) చెన్నయ్య, పీఎం ఐటీ చిరంజీవి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
