బర్త్ డే పార్టీకి వెళ్లొస్తుండగా వెంటాడిన మృత్యువు.. ఒకే ఫ్యామిలీలో ఐదుగురు స్పాట్ డెడ్

బర్త్ డే పార్టీకి వెళ్లొస్తుండగా వెంటాడిన మృత్యువు.. ఒకే ఫ్యామిలీలో ఐదుగురు స్పాట్ డెడ్

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మైహార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో దూసుకెళ్లిన కారు అదుపు తప్పి ట్రక్‎ను ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఐదుగురు మరణించగా.. ఒకరు గాయపడ్డారు. అమరపటన్‌లో జరిగిన బంధువు పుట్టినరోజు వేడుకకు హాజరై తిరిగి ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం రూపంలో వీరిని మృత్యువు వెంటాడింది. 

మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం మరింత విషాదకరం. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా శ్రమించి కారులో చిక్కుకున్న ఐదుగురు మృతదేహాలను బయటకు తీసి పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

మృతులను అంకుర్ పటేల్ (40), మృదుల్ పటేల్ (32), విజయ్ పటేల్ (30), హరిశంకర్ పటేల్ (25), శివ పటేల్ (23) గా గుర్తించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. మృతులు అమరపటన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడి బంధువులు అని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది.