మాట్లాడుదామని పిలిచి యువకుడి హత్య.. కత్తులతో నరికి చంపిన స్నేహితులు

మాట్లాడుదామని పిలిచి యువకుడి హత్య.. కత్తులతో నరికి చంపిన స్నేహితులు

బాలాపూర్‌‌‌‌, వెలుగు: మాట్లాడుకుని వివాదం పరిష్కరించుకుందామంటూ పిలిచి ఓ యువకుడిని అతడి స్నేహితులు కత్తులతో నరికి హత్య చేశారు. ఈ ఘటన బాలాపూర్‌‌‌‌ పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఓల్డ్​ సిటీకి చెందిన ఫహాద్‌‌‌‌ బిన్‌‌‌‌ అబ్దుల్‌‌‌‌ రెహమాన్‌‌‌‌ బల్కసూర్‌‌‌‌(29), సయ్యద్‌‌‌‌ బిన్‌‌‌‌ ఫైసల్‌‌‌‌ బాన్‌‌‌‌,  సాలం భామ్‌‌‌‌  స్నేహితులు. వీరు రియల్​ ఎస్టేట్​ వ్యాపారం చేస్తుంటారు. లావాదేవీల విషయంలో బల్కసూర్ కు.. మిగతా ఇద్దరితో కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో గొడవలను సామరస్యంగా పరిష్కరించకుందామని రెహమాన్​ బల్కనూర్​ను ఫైసల్​ బాన్​, సాలం భామ్​బాలాపూర్‌‌‌‌ పరిధిలోని బార్కాస్‌‌‌‌ సలాలా మరియం కాలనీకి సోమవారం తెల్లవారుజామున పిలిపించారు. అక్కడికి వచ్చాక వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఫైసల్​ బాన్​, సాలం భామ్ తమ వెంట తెచ్చుకున్న కత్తులతో బల్కసూర్​ను విచక్షణారహితంగా దాడి చేసి చంపేశారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు బాలాపూర్‌‌‌‌ ఇన్‌‌‌‌స్పెక్టర్‌‌‌‌ సుధాకర్‌‌‌‌ తెలిపారు.