ఫెర్నాండెజ్ హాస్పిటల్లో లిటిల్ ఫెర్న్స్..

ఫెర్నాండెజ్ హాస్పిటల్లో లిటిల్ ఫెర్న్స్..

హైదరాబాద్​, వెలుగు: ఫెర్నాండెజ్ హాస్పిటల్స్ హైదరాబాద్ అంతటా తమ ప్రత్యేక పీడియాట్రిక్ పిల్లల ఇన్‌‌పేషెంట్ సేవలను లిటిల్ ఫెర్న్స్ పేరుతో సోమవారం (జులై 06) ప్రారంభించింది.  అనుభవజ్ఞులైన పిల్లల వైద్య నిపుణుల సేవలను విస్తృతంగా అందిస్తామని తెలిపింది.

 ఈ ప్రత్యేక పీడియాట్రిక్ సేవలు  బొగ్గులకుంట, బంజారాహిల్స్ స్టార్క్ హోమ్, హైదర్‌‌గూడ శాఖలలో అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా ఫెర్నాండెజ్ హాస్పిటల్ నియోనాటాలజీ, పీడియాట్రిక్స్ విభాగం హెడ్ డాక్టర్ సునీల్ పవార్, డాక్టర్ ఎవీటా ఫెర్నాండెజ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ లిటిల్ ఫెర్న్స్ ప్రారంభంతో ఆసుపత్రిలో స్వల్పకాలం ఉండాల్సిన అవసరం ఉన్న పిల్లలకు నిరంతర పర్యవేక్షణ లభిస్తుందని చెప్పారు.