జనగామ అర్బన్, వెలుగు: ఎల్ఆర్ఎస్ ఫీజులు, ఇతర చార్జీల చెల్లింపుపై ప్రభుత్వం ప్రకటించిన 25 శాతం రాయితీ గడువును ఈ నెల 31 వరకు పొడగించినట్లు జనగామ మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి సోమవారం తెలిపారు.
జనగామ మున్సిపాలిటీ పరిధిలో ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకుని, ఇప్పటివరకు ఫీజులు చెల్లించని దరఖాస్తుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
