భోజనంకు బదులు అరటిపండు.. నెక్కొండ హైస్కూల్‌‌‌‌లో ఘటన

భోజనంకు బదులు అరటిపండు.. నెక్కొండ హైస్కూల్‌‌‌‌లో ఘటన

నెక్కొండ, వెలుగు: మధ్యాహ్న భోజనం సరిపోక కొంతమంది విద్యార్థులకు అరటిపండ్లు ఇచ్చిన ఘటన వరంగల్‌‌‌‌ జిల్లా నెక్కొండ టౌన్‌‌‌‌ హైస్కూల్‌‌‌‌లో జరిగింది. ఈ విషయంపై ఎంఈవో రవికుమార్‌‌‌‌ సోమవారం విచారణ చేపట్టారు. ఎంఈవో తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం పాఠశాలలో 74 మంది విద్యార్థులు హాజరుకాగా, 63 మందికి మాత్రమే సరిపడా భోజనం వండారు.

మిగిలిన విద్యార్థులకు అన్నం లేకపోవడంతో అరటిపండ్లు ఇచ్చారు. ఈ ఘటనపై హెచ్​ఎం శ్రీదేవి, మధ్యాహ్న భోజన సిబ్బందిని వివరణ కోరినట్లు ఎంఈవో తెలిపారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదే పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని బయోసైన్స్‌‌‌‌ టీచర్​ కొట్టడంతో తల్లిదండ్రులు వచ్చి గొడవ చేశారు. గాయపడిన విద్యార్థిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు తెలిపారు.