దరాబాద్, వెలుగు: బండ్లగూడ మండలం కేశవగిరి కాలనీలోని సలార్-ఇ-మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ భవన నిర్మాణాలకు సంబంధించి యథాతథస్థితిని కొనసాగించాలని హైకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేశవగిరిలోని సర్వే నెం.62/2, 62/3, టౌన్ సర్వే నెం.8లో 2,360 చదరపు గజాల స్థలంలో నిర్మించిన ఏడు అంతస్తుల భవనాన్ని కూల్చివేయడానికి జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రయత్నిస్తున్నారని ట్రస్ట్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.
దీనిపై జస్టిస్ బి. విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. జీహెచ్‌ఎంసీ అధికారులు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఈ నెల 3న భవన ప్రాంగణంలోకి ప్రవేశించి కూల్చివేతకు యత్నించారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి, బీఆర్‌ఎస్ కింద దరఖాస్తు పెండింగ్‌లో ఉన్నందున భవనానికి సంబంధించి యథాతథస్థితిని కొనసాగించాలని జీహెచ్‌ఎంసీని ఆదేశించారు.
