సికింద్రాబాద్‌‌ ‘ఉజ్జయిని’ ఆలయానికి కొత్త ట్రస్ట్ బోర్డు

సికింద్రాబాద్‌‌ ‘ఉజ్జయిని’ ఆలయానికి కొత్త ట్రస్ట్ బోర్డు

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్‌‌లోని శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవాలయానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేసింది. మొత్తం 14 మంది సభ్యులను నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో సురిటి కామేశ్వర్, రాజేంద్ర చక్కల, ఎం.కిరణ్, గుండేల్లి దేవి వర ప్రసాద్, మంత్రి సోనాలి, యాదగిర్ శ్రీకాంత్, గౌరపల్లి రమేష్, గంట గీత, గుంటి మల్లికార్జున్, డాక్టర్ కటకం భాస్కర్ గుప్తా, సంజయ్ ప్రకాశ్ ఉపాధ్యాయ, ఠాకూర్ హేమంత్ సింగ్, రాకేశ్ అగర్వాల్, ఎం.శివకుమార్ లాల్ ఉన్నారు. అలాగే, ప్రత్యేక నిబంధనల మేరకు రామతీర్థ శర్మను ఎక్స్ అఫీషియో మెంబర్‌‌గా నియమించింది. కొత్త కమిటీ సభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు.