ఎంఐఎం నేతపై మాజీ ఎమ్మెల్యే దాడి.. మొఘల్‌‌‌‌పురాలో రోడ్డు పనులపై వివాదం

ఎంఐఎం నేతపై మాజీ ఎమ్మెల్యే దాడి.. మొఘల్‌‌‌‌పురాలో రోడ్డు పనులపై వివాదం

చార్మినార్‌‌‌‌, వెలుగు: చార్మినార్‌‌‌‌ నియోజకవర్గంలోని మొఘల్‌‌‌‌పురాలో రోడ్డు పనుల సందర్భంగా జరిగిన వివాదంలో ఎంఐఎం కార్యకర్త అక్బర్‌‌‌‌పై మాజీ ఎమ్మెల్యే ముంతాజ్‌‌‌‌ ఖాన్‌‌‌‌ దాడి చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్‌‌‌‌గా మారాయి.

స్థానికుల వివరాల ప్రకారం.. మొఘల్‌‌‌‌పురా తీన్‌‌‌‌కోని చమన్‌‌‌‌ ఫైర్‌‌‌‌ స్టేషన్‌‌‌‌ సమీపంలో సోమవారం సాయంత్రం రోడ్డు పనులు జరుగుతుండగా, స్థానిక ఎంఐఎం నాయకుడు అక్బర్‌‌‌‌ వాటిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు సమాచారం ఇవ్వకుండా పనులు చేపట్టారని ప్రశ్నించినట్లు తెలిసింది. రోడ్డు పనులు చేపడుతున్న వారు మాజీ ఎమ్మెల్యే ముంతాజ్‌‌‌‌ ఖాన్‌‌‌‌ పేరు చెప్పినా అక్బర్‌‌‌‌ అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం చెలరేగింది. ఈ క్రమంలో బాకర్‌‌‌‌ భాయ్‌‌‌‌, మాజీ ఎమ్మెల్యే ముంతాజ్‌‌‌‌ ఖాన్‌‌‌‌ .. అక్బర్‌‌‌‌పై దాడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పైప్‌‌‌‌లైన్‌‌‌‌ పనులే వివాదానికి కారణం..
మొఘల్‌‌‌‌పురాలోని ఓ ఇంటి యజమాని పైప్‌‌‌‌లైన్‌‌‌‌లు మార్చుకుంటుండగా అక్బర్‌‌‌‌ అభ్యంతరం తెలిపారని, దీంతో ఇంటి యజమాని ముంతాజ్‌‌‌‌ ఖాన్‌‌‌‌కు ఫోన్‌‌‌‌లో విషయం చెప్పారని ఎంఐఎం నాయకుడు బాకర్‌‌‌‌ తెలిపారు. ఫోన్‌‌‌‌లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగగా, అనంతరం ఘటనాస్థలికి వచ్చిన ముంతాజ్‌‌‌‌ ఖాన్‌‌‌‌, అక్బర్‌‌‌‌ మధ్య మాటామాట పెరిగి ఘర్షణజరిగిందని చెప్పారు.