సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ చైతన్య యూపీఎస్ స్కూల్‌లో అనుమతి లేకుండా 8, 9, 10 తరగతులు నిర్వహిస్తుండడంతో సీజ్ చేసినట్లు ఎంఈవో రాజయ్య సోమవారం తెలిపారు.
ఈ స్కూల్ కు నర్సరీ నుంచి 7వ తరగతి వరకు మాత్రమే అనుమతి ఉందని, కానీ ఈ విద్యా సంవత్సరం నుంచి పై తరగతులను నిర్వహిస్తున్నారని సమాచారం అందడంతో పరిశీలించి సీజ్ చేసినట్టు తెలిపారు. పర్మిషన్లు లేకుండా నడిపే స్కూళ్లలో తమ పిల్లలను చేర్పించవద్దని పేరెంట్స్‌కు సూచించారు.
