కామారెడ్డిలో అక్రమ లేఆవుట్పై కొరడా..వెంచర్ లో రోడ్లు, డ్రైనేజీ తొలగింపు

కామారెడ్డిలో అక్రమ లేఆవుట్పై కొరడా..వెంచర్ లో రోడ్లు, డ్రైనేజీ తొలగింపు

కామారెడ్డి టౌన్, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలో అక్రమ లేఆవుట్లపై మున్సిపల్ అధికారులు శుక్రవారం కొరఢా ఝుళిపించారు. పర్మిషన్లు లేకుండా ప్లాట్లుగా మార్చటం, రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టగా వాటిని జేసీబీలతో తొలగించారు.

వికాస్​నగర్​ కాలనీ సమీపంలో సర్వే నంబర్లు 672, 675, 676, 677, 678లోని 3 ఎకరాల 39 గుంటల్లో లేఆవుట్​చేస్తున్నారని మున్సిపల్​కమిషనర్ ముత్యాలు పేర్కొన్నారు. పర్మిషన్ ​లేకపొవటంతో నోటీసులు ఇచ్చామని, అయినప్పటికీ పనులు చేస్తుండటంతో చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పోలీసు బందోబస్తు మధ్య వెంచర్​లో వేసిన రోడ్లు, డ్రైనేజీలను ధ్వంసం చేశారు.