కోల్‌బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రిలోని విద్యానగర్హనుమంత్ స్ర్కాప్ దుకాణంలో సింగరేణి సంస్థకు సంబంధించిన 2,180 కిలోల ఇసుప స్క్రాప్‌ను మంగళవారం సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. సెక్యూరిటీ విభాగం ఇంటలిజెన్స్ గార్డు కె.శ్రీనివాస్ రావు, దాసరి మల్లేశ్ ఇచ్చిన సమాచారంతో ఎస్ అండ్ పీసీ జూనియర్ ఇన్స్పెక్టర్, ఐడీ పార్టీ సిబ్బంది దుకాణంపై రైడ్చేశారు.
సింగరేణి స్ర్కాప్‌ను వ్యాన్‌లో లోడ్ చేసుకొని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన వ్యాన్‌ను పట్టుకున్నారు. పట్టుకున్న స్ర్కాప్ విలువ సుమారు రూ.50వేలు ఉంటుందని, స్క్రాప్‌తో ఉన్న వ్యాన్‌ను స్వాధీనం చేసుకొని డ్రైవర్‌ను మందమర్రి పోలీసులకు అప్పగించామని వారు తెలిపారు.
