Team India 7 Players Out, 6 Players In: ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ ఇంకా కొనసాగుతుండగానే, బీసీసీఐ (BCCI) రాబోయే జింబాబ్వే పర్యటన కోసం భారత టీ20 జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ తన మొదటి సిరీస్‌ను 2–0తో ఘోరంగా ఓడిపోవడమే కాకుండా, ప్రస్తుత ఇంగ్లాండ్ సిరీస్‌లోనూ 1–0తో వెనుకబడింది. దీంతో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ జింబాబ్వే టూర్ కోసం జట్టులో భారీ మార్పులు చేసింది. జూలై 23 నుంచి జూలై 26 వరకు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఈ 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ 15 మంది సభ్యుల జట్టులోకి ఆరుగురు కొత్త ప్లేయర్స్ ని సెలక్ట్ చేయగా, ప్రస్తుతం ఇంగ్లాండ్ టూరులో ఉన్న ఏడుగురు ఆటగాళ్లను పక్కన పెట్టేసింది.
వరల్డ్ కప్ హీరోపై వేటు:
ఈ జట్టు ఎంపికలో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం సంజు శాంసన్ కి ఉద్వాసన పలకడమే.. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో సంజును తుది జట్టు నుంచి తప్పించి, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి డెబ్యూ చేసేందుకు ఛాన్స్ ఇచ్చారు. దీంతో సూర్యవంశీ భారతదేశపు అత్యంత పిన్న వయస్కుడైన అంతర్జాతీయ క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు, అలాగే జింబాబ్వే టూర్‌కు కూడా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మరోవైపు, 2026 టీ20 వరల్డ్ కప్ గెలుపులో వర్చువల్ క్వార్టర్ ఫైనల్‌లో వెస్టిండీస్‌పై (97*), సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై (89), ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై (89) వరుస హాఫ్ సెంచరీలతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచిన శాంసన్‌ను.. కేవలం 3 మ్యాచ్‌ల వైఫల్యం చెందడంతో జట్టు నుంచి తప్పించడం గమనార్హం.
నలుగురు కొత్త ప్లేయర్లకు ఛాన్స్:
వరల్డ్ కప్ 2026 గెలిచిన జట్టులో సభ్యుడైనప్పటికీ, ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక కాని ఫినిషర్ రింకూ సింగ్ తిరిగి జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. అలాగే స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్‌తో పాటు వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్ వంటి సీనియర్లకు ఈ పర్యటన నుంచి విశ్రాంతినిచ్చారు లేదా పక్కన పెట్టారో అర్థం కాక ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు. ఈ టూర్‌లో ప్రభ్‌సిమ్రాన్ సింగ్, హర్ష్ దూబే, అశోక్ శర్మ, యశ్ ఠాకూర్లు భారత్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది.
జింబాబ్వే సిరీస్ కోసం భారత జట్టులో జరిగిన మార్పులు:
* ఇండియా టీమ్లోకి వచ్చిన వారు (In): రింకూ సింగ్, హర్ష్ దూబే, అశోక్ శర్మ, యశ్ ఠాకూర్, మయాంక్ యాదవ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్.
* జట్టులో స్థానం కోల్పోయిన వారు (Out): సంజు శాంసన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్.
