కేరళ రాష్ట్రం వయనాడు జిల్లా మెప్పాడి ప్రాంతంలో టన్నెట్ రోడ్ ప్రాజెక్ట్ నడుస్తుంది. కొండ కిందుగా టర్నెల్ నిర్మించే పనులు కొన్నాళ్లుగా సాగుతున్నాయి.
కొన్ని రోజులుగా వయనాడ్ ఏరియాలో కుండపోత వర్షాలు పడుతున్నాయి. వారం రోజులుగా పడుతున్న వర్షాలతో కొండపై ఉన్న మట్టి అంతా మెత్తగా అయిపోయింది. దీనికితోడు కొండ ప్రాంతాల్లో నీటి నిల్వ భారీగా ఉంది. ఈ క్రమంలోనే టన్నెల్ రోడ్డు ప్రాజెక్ట్ దగ్గర కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ వెంటనే బురద, నీళ్లు పెద్ద ఎత్తున కొట్టుకు వచ్చాయి. బురద నీళ్ల ఉధృతి ఏ స్థాయిలో ఉంది అంటే బస్సులు, లారీలు, ట్యాంకర్లు కొట్టుకుపోయాయి.. కొండ చరియలు విరిగిపడి.. రోడ్డుపైకి దూసుకొస్తున్న విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.
ALSO READ : ప్రియుడితో కలిసి భర్తను చంపి,..మహారాష్ట్ర బార్డర్ లో పూడ్చిపెట్టిన భార్య..
బురద నీళ్లతో కొండ చరియలు విరిగి పడిన సమయంలో సమీపంలో ఉన్న మనుషులు పరుగులు తీశారు. వాళ్లను ముంచెత్తుతూ వెళ్లింది. టన్నెల రోడ్డు సమీపంలోని ఓ షాపులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.
