హైదరాబాద్ మెట్రో ఎక్కుదామని వెళుతున్నారా.. డబ్బులకు నో టికెట్.. ఫోన్ ఉంటేనే టికెట్..!

హైదరాబాద్ మెట్రో ఎక్కుదామని వెళుతున్నారా.. డబ్బులకు నో టికెట్.. ఫోన్ ఉంటేనే టికెట్..!

హైదరాబాద్ మెట్రో సరికొత్త వ్యూహంతో ముందుకెళుతుంది. 100 శాతం డిజిటల్ దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని క్యాష్ కౌంటర్లు మూసివేయటం సంచలనంగా మారింది. జేబులో డబ్బులు ఉన్నాయి.. కౌంటర్ లో టికెట్ కొనుక్కుని ఎంచక్కా మెట్రోలో వెళ్లిపోవచ్చు అనుకునే వాళ్లకు షాకింగ్ ఇది. అవును.. ఓన్లీ డిజిటల్ దిశగా మారుతున్న హైదరాబాద్ మెట్రో టికెట్ ఇష్యూ వివరాలు ఇలా ఉన్నాయి. 

హైదరాబాద్ మెట్రోలో ప్రతి రోజూ లక్షల మంది ప్రయాణిస్తుంటారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు వెళుతుంటారు. 100 శాతం డిజిటల్ వ్యూహంలో భాగంగా.. కొన్ని మెట్రో స్టేషన్లలో డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కునే విధానాన్ని మూసివేసింది. సింపుల్ గా చెప్పాలంటే టికెట్ కౌంటర్లు క్లోజ్. మరి టికెట్ ఎలా కొనుక్కోవాలి అంటే QR కోడ్, వెండింగ్ మెషీన్స్, ఆన్ లైన్ ద్వారా కొనుక్కోవాలి. మొబైల్ లో డేటా లేదు.. నాది స్మార్ట్ ఫోన్ కాదు అని మీరు అనుకుంటే.. మెట్రో రైలు ఎక్కొద్దు.. 

ఏయే స్టేషన్లలో టికెట్ కౌంటర్లు క్లోజ్ అంటే : 

క్యాష్ లెస్ టికెట్ కౌంటింగ్ వ్యవస్థలో భాగంగా అమీర్ పేట్, మియాపూర్, MGBS, సికింద్రాబాద్, రాయదుర్గం మెట్రో స్టేషన్లలో టికెట్ కౌంటర్లను మూసివేశారు. ఆయా స్టేషన్లలో QR కోడ్, గూగుల్ వాలెట్ ద్వారా QR కోడ్ స్కాన్ చేసి.. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలి అని మెసేజ్ చేస్తే టికెట్ వస్తుంది. మొబైల్ యాప్స్, వాలెట్స్, స్మార్ట్ కార్డుల ద్వారా మెట్రోలో జర్నీ దిశగా అడుగులు వేసింది హైదరాబాద్ మెట్రో. 

ALSO READ :  వయనాడ్ కొండ విలయం : బస్సులు, లారీలు, ట్యాంకర్లు కొట్టుకుపోయాయి.. !

క్యాష్ లెస్ టికెట్ వ్యవస్థపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎంజీబీఎస్ బస్టాండ్ కు వెళ్లే వాళ్లలో చాలా మంది వృద్ధులు, గ్రామీణ ప్రాంతాల వాళ్లు ఉంటారు. అలాంటి వాళ్లకు స్మార్ట్ ఫోన్లపై అవగాహన ఉండదు. ఆన్ లైన్ లో టికెట్ తీసుకోవటం తెలియదు. ఇలాంటి వాళ్లు ఇప్పుడు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇక అమీర్ పేట్ మెట్రో జంక్షన్.. విపరీతమైన రద్దీతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లకు ఇబ్బందిగా ఉంటుంది చాలా మంది ప్రయాణికలు కంప్లయింట్ చేస్తున్నారు.