నా పేరుతో పిచ్చి పిచ్చి పోస్టులా.. వైరల్ కోసం ఏదైనా చేస్తారా?.. సూర్యకుమార్ ఫుల్ ఫైర్!

నా పేరుతో పిచ్చి పిచ్చి పోస్టులా.. వైరల్ కోసం ఏదైనా చేస్తారా?.. సూర్యకుమార్ ఫుల్ ఫైర్!

Suryakumar Yadav: భారత క్రికెట్‌లో గత కొన్ని రోజులుగా కెప్టెన్సీ మార్పుల అంశం హాట్ టాపిక్‌గా నడుస్తోంది. మొన్నటి వరకు టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించి, సారథ్యం మొత్తాన్ని శ్రేయస్ అయ్యర్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మార్పులపై సూర్య అసంతృప్తిగా ఉన్నాడని, టీమ్ మేనేజ్‌మెంట్‌ను ఏకిపారేస్తూ ఒక స్టేట్‌మెంట్ ఇచ్చాడంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ తెగ వైరల్ అయింది. ఇక ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చాడు సూర్యకుమార్. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ వైరల్ ప్రకటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాడు. అలాంటి ఫేక్ వార్తలను అస్సలు నమ్మొద్దని ఫ్యాన్స్‌కు సూచించాడు.

ఇన్ స్టా వేదికగా సూర్య ఫైర్: 
ప్రస్తుతం ఉన్న జట్టు కూర్పు పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను అని సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. టీమిండియాకు ఎప్పుడూ మంచి జరగాలనే కోరుకుంటాను.. కుర్రాళ్లు జట్టులో చాలా అద్భుతంగా రాణిస్తున్నారు.. వారికి నా సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ.. నీ క్రికెట్ ప్రయాణం ఇప్పుడే మొదలైంది, ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తూ దేశం గర్వపడేలా చేయాలని పేర్కొన్నాడు. ఇకపోతే సోషల్ మీడియాలో నా పేరుతో వైరల్ అవుతున్న పోస్ట్ ఒకటి నా దృష్టికి వచ్చింది.. అదంతా ఫేక్! ఆ నకిలీ వార్తలను నాకు ఆపాదిస్తున్నారు, ఆ కామెంట్స్ నేను చేయలేదు.. దయచేసి ఇలాంటి అబద్ధపు ప్రచారాలను నమ్మకండి.. భారత క్రికెట్‌కు, నా సహచర ఆటగాళ్లకు నా మద్దతు ఎప్పటికీ ఉంటుందని సూర్య భాయ్ వెల్లడించాడు. 

జట్టుకు ఎప్పటికీ నా సపోర్ట్: 
సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన ఈ క్లారిటీతో సోషల్ మీడియాలో జరుగుతున్న కెప్టెన్సీ వివాదానికి ఒక్కసారిగా బ్రేక్ పడింది. టీమ్ మేనేజ్‌మెంట్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, కొత్తగా జట్టులోకి వచ్చే కుర్రాళ్లకు తన ఫుల్ సపోర్ట్ ఉంటుందని చెప్పడంతో సూర్య తన క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు. ఈ స్టేట్‌మెంట్‌తో ఫేక్ వార్తలు ప్రచారం చేసేవాళ్ల నోళ్లు మూతపడ్డాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.