చదువుకునే వయసులో అంత కష్టం ఏమొచ్చిందమ్మా...! జగిత్యాల జిల్లాలో పురుగుల మందు తాగి మైనర్ ఆత్మహత్య...

చదువుకునే వయసులో అంత కష్టం ఏమొచ్చిందమ్మా...! జగిత్యాల జిల్లాలో పురుగుల మందు తాగి మైనర్ ఆత్మహత్య...

జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హాస్టల్ నుంచి ఇంటికి వచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది మైనర్ బాలిక. మంగళవారం ( జులై 7 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం జగదేవ్‌పేట గ్రామానికి చెందిన లాస్య అనే మైనర్ బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

లాస్య నిన్న సాయంత్రం హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిందని... ఇవాళ పురుగుల మందు తాగి అస్వస్థతకు గురైందని తెలిపారు కుటుంబసభ్యులు. విషయం తెలిసిన వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా... మార్గమధ్యలోనే లాస్య మృతి చెందిందని తెలిపారు కుటుంబసభ్యులు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. లాస్య మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.