- జీవీకే నుంచి పీవీఎన్ఆర్ఎక్స్ ప్రెస్‌వేను కలిపేలా నిర్మాణం
- మాసాబ్‌ట్యాంక్ సర్కిల్లో అండర్‌పాస్
- 3 కిలోమీటర్లలో 5 చోట్ల టువే అప్ అండ్ డౌన్ ర్యాంపులు
- కన్సల్టెన్సీకి డీపీఆర్బాధ్యతలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్ సమస్య నివారణకు మరో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు హెచ్ఎండీఏ ప్లాన్ రూపొందించింది. దీనివల్ల సిటీ సెంటర్ నుంచి ఎయిర్ పోర్టుకు వెళ్లే వారితో పాటు మాసబ్‌ట్యాంక్, మెహిదీపట్నం వైపు వెళ్లే వారికి ట్రాఫిక్ తిప్పలు తప్పనున్నాయి.
బంజారాహిల్స్జీవీకే –1 మాల్ నుంచి మొదలయ్యే ఈ ఫ్లై ఓవర్..తాజ్ కృష్ణ, కేర్ హాస్పిటల్, పెన్షన్ ఆఫీసు మీదుగా మాసాబ్ ట్యాంక్, ఎన్ఎండీసీ మీదుగా పీవీఎన్ఆర్ఎక్స్ప్రెస్ వేను కలుపుతుంది. మొత్తం 3 కిలోమీటర్ల పొడవున నిర్మించే ఈ ఫ్లై ఓవర్నిర్మాణానికి సాధ్యాసాధ్యాలతో పాటు, డీపీఆర్సిద్ధం చేసేందుకు ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీకి బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తే రెండేండ్లలో ప్రాజెక్టు పూర్తి చేయడానికి హెచ్ఎండీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ఎక్కడి నుంచి ఎలా నిర్మిస్తారంటే..
పంజాగుట్ట, జీవీకే మాల్, కేర్ హాస్పిల్, పెన్షన్ఆఫీసు మీదుగా మెహదీపట్నం వద్ద పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్లే వారికి నిత్యం ట్రాఫిక్నరకం తప్పడం లేదు. ఇటు లక్డీకాపూల్, ఖైరతాబాద్ వైపు నుంచి వచ్చే వాహనదారులకు సైతం మాసాబ్‌ట్యాంక్ వద్ద, అటు ఎన్ఎండీసీ వద్ద ట్రాఫిక్ సమస్య ఎదురవుతోంది. దీంతో హెచ్ఎండీఏ ఆఫీసర్లు బంజారాహిల్స్జీవీకే మాల్నుంచి కేర్‌హాస్పిటల్, పెన్షన్హాస్పిటల్, మాసాబ్‌ట్యాంక్, సరోజిని దేవీ హాస్పిటల్వరకూ ఫోర్వే ఫ్లై ఓవర్నిర్మించి పీవీఎన్ఆర్ఎక్స్ప్రెస్వేకు కనెక్ట్చేస్తారు.
అలాగే, కింద సర్వీస్రోడ్లపై వెళ్లే వారు కూడా మెహదీపట్నం వరకూ ఫ్లై ఓవర్‌ను ఉపయోగించుకునేలా మూడు అప్ర్యాంపులు, జీవీకే దగ్గర ఎక్కేవారు దిగడానికి రెండు డౌన్ర్యాంపులను నిర్మించనున్నారు. తాజ్దక్కన్వైపు, మాసాబ్‌ట్యాంక్, ఎన్ఎండీసీ దగ్గర మూడు అప్ర్యాంపులు,..ఆసిఫ్నగర్రోడ్, బంజారాహిల్స్రోడ్నంబర్2 వద్ద దిగడానికి డౌన్ ర్యాంపులను కట్టనున్నారు.
మాసబ్ ట్యాంక్ దగ్గర అండర్ పాస్
మాసాబ్‌ట్యాంక్ దగ్గర ఇప్పటికే ఫ్లై ఓవర్ ఉండడంతో దాని పై నుంచి ఈ ఫ్లై ఓవర్ కట్టాలని అనుకుంటున్నారు. అలాగే, బంజారాహిల్స్ నుంచి వచ్చే వాళ్లు విజయ్‌నగర్ కాలనీ వైపు వెళ్లేందుకు అండర్‌పాస్ నిర్మించనున్నారు.
పీవీఎన్ఆర్తో తగ్గిన సగం కష్టాలు
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే వారికి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది ఉండకూడదని ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పీవీఎన్ఆర్పీవీ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించారు. సరోజినీదేవి హాస్పిటల్నుంచి మెహదీపట్నం మీదుగా ఆరామ్‌ఘర్ వరకు 11 కి.మీ. మేర నిర్మించిన ఈ ఫ్లై ఓవర్తో సగం ట్రాఫిక్కష్టాలు తప్పాయి. ఇప్పుడీ కొత్త ఫ్లై ఓవర్నిర్మాణం పూర్తయితే నగరం నడిబొడ్డు నుంచి వచ్చే వాహనాలు ఈజీగా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవచ్చు.
